ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?

bjp-specialstatus

Why BJP govt not giving Special Status to Andhra Pradesh. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

భారత రాజ్యాంగం లో అంబేద్కర్ ముందు చూపుతో రిజర్వేషన్లపై రాసిన శాసనాలను తుంగలో తొక్కి ఇందిరాగాంధీ తన ఇష్టానుసారంగా ఓట్ల కోసం రిజర్వేషన్ సిస్టమ్ అనే అతి పెద్ద అక్షయపాత్రను తయారుచేశారు. ఇంకేముంది దీనికి అలవాటుపడిన వారు ఎటువంటి కష్టంలేకుండా రోజూ భోజనం చెయ్యవచ్చు. దీని అర్హతలు అలాంటివి. మరి దొరకని వారు ఊరుకుంటారా..? మేమూ వెనకబడ్డాం మమ్మల్ని కూడా గుర్తించండి మమ్మల్ని కూడా అక్షయపాత్ర(రిజర్వేషన్) కేటగిరీలోకి చేర్చండని దేశవ్యాప్తంగా ఒక్కొక్క సామాజిక వర్గం ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నది.

ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రత్యేక హోదాకు కూడా ఎన్నో దేశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ ఈ విధంగానే అనేక అక్షయపాత్రలు లాంటివి తీసుకువచ్చింది. అందులో మరొకటి ప్రత్యేక హోదా. దేశంలో ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఈ ప్రత్యేక హోదాలో కీలక అంశం ఏమిటంటే.. ట్యాక్స్ బెనిఫిట్. దీని ద్వారా పరిశ్రమలు తలివస్తాయి.తద్వారా ఆ రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి అనేది ఒక వాదన. అయితే ఇది కేవలం ఆయా రాష్ట్రాల పాలకుల, ప్రజల తెలివితేటలు ఇంకా చెప్పాలంటే ప్రకృతిసిద్ధ వనరులపైన ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ అవకాశాలు మాత్రం ఆకాశమే హద్దుగా ఉంటాయి.

ఈ పోటీ ప్రపంచంలో ఇప్పటికే ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాలు ఆ పక్క రాష్ట్రాలకు సవాలుగా తయారయ్యాయి. దీని వలన చేసేదేమీలేక ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. తమకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. దక్షిణాదిన మన విషయానికి వస్తే ఇది ఇంకా విచిత్రం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది.పోటీ అనేది సమానంగా ఉండాలని ఆంధ్రాకు ఇస్తే తమకు కూడా ఇవ్వాలని అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసి విజ్ఞప్తి చేసి ముందుగానే లిటిగేషన్ పెట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మరిన్ని రాష్ట్రాలు హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడం ఖాయం. అందులో దీనికి సమాదానం ఏంటి..? ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్య పరిష్కారం ఏంటి..? ఇది మరలా ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..? ఈ ఆలోచనలతోనే ముందుకు వెళ్లిన బిజెపి ప్రభుత్వం ప్రత్యేక సహాయం పేరుతో ఒక చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.

ప్రత్యేక సహాయం దీనికి వారు ఆంగ్లంలో పెట్టిన పేరు SAM(Special Assistance Measure) 08.09.2016 తేదినాడు కేంద్ర ప్రభుత్వం PIB వెబ్ సైట్లో పొందుపరిచారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఉన్న ప్రత్యేక హోదాలు గల రాష్ట్రాలకు హోదా అదేవిధంగా కొనసాగించుతారు. కానీ SAM  ఆలోచన మాత్రం ఆంధ్రప్రదేశ్ నుండే మొదలైంది.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
బాబు Khan
ఎవరు చాణిక్యులు..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
పిట్టల దొరను మించిన మాటల దొర
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments