ఆట ఆడలేమా..?

Why cant we win Medal in Sports like Olympics

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదే మరి. 120 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారతదేశంలో ఆటలు అంటే అదేదో టైంపాస్ అనుకునే రోజులు ఇవి. ఆటలను ఆటలుగా కాకుండా చిన్నచూపు చూడటం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఒక్క క్రికెట్ తప్ప మన వాళ్లకు ఎందులోనూ బలం లేదు. పచ్చిగా చెప్పాలంటే చేతకాదు. ఒలంపిక్స్ లో మన వాళ్లు సెలెక్ట్ అయితే అదో ఘనకార్యంగా మారింది. అది కూడా వాస్తవమే. ఏ చెట్టూలేని చోట మునగచెట్టే మర్రిమాను మరి. కోతలు కోసే వాళ్లు ఎంతో మంది ఉన్నా కూతకు వెళ్లే వాళ్లు మాత్రం కరువయ్యారు.

భారత్ ఒలంపిక్స్ లో పాల్గొనడంపై తాజాగా శోభా డీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాకానీ ఆమె మాటలు నిజంగా అక్షర సత్యాలు. ఆమె చెప్పినట్లే మన వాళ్లు అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగి.. తిరిగి భారత్ కు చేరుతున్నారు.. వట్టి చేతులతో. అయితే తప్పు వెళ్లిన క్రీడాకారులది కాదు.. ఖచ్చితంగా వ్యవస్థది. క్రీడారంగానికి ప్రోత్సాహం లేకుండా చేసిన చచ్చుబడిన సిస్టమ్ ది. పతకాల వేటలో ఎప్పుడూ ముందుండే చైనా దీనిపై ఓ వ్యాసాన్ని రాసింది. భారత్ కు ఎందుకు మెడల్స్ రావడం లేదంటే అని టౌషౌ అనే ఓ వెబ్ సైట్ వార్త రాసింది.

‘భారత్‌లో 120 కోట్ల జనాభా ఉంది. చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశం అదే. అయినా ఒలింపిక్స్‌లో ఆ దేశానికి పథకాలు ఎందుకు రావడం లేదు? జనాభాపరంగా పతకాలను బేరిజు వేసి చూస్తే గత ఒలింపిక్స్‌లో అట్టడుగున నిలిచింది భారతే. 2012 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆరు పతకాలు సాధించింది. అందులో ఒక్క స్వర్ణం కూడా లేదు’ అని చైనా మీడియా పేర్కొంది. అసలు భారత్ కు ఎందుకు మెడల్స్ రావడం లేదు అని.. దానిపై తగిన కారణాలను కూడా ఆ వెబ్ సైట్ వివరించింది.

Related posts:
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
తెలంగాణకు ప్రత్యేక అండ
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
బాబు బిత్తరపోవాల్సిందే..
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
దిగజారుతున్న చంద్రబాబు పాలన
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
500 నోటుపై ఫోటో మార్చాలంట
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
డబ్బు మొత్తం నల్లధనం కాదు
డిసెంబర్ 31న మోదీ స్పీచ్

Comments

comments