జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు…?

Why Chandrababu Fears about jagan assets

వైయస్ జగన్ కూడబెట్టిన ఆస్తులు అన్నీ అక్రమమే అని ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ముందు నుండి కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సాక్షి మీడియాతో సహా అతడి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని కూడా గతంలో ప్రకటన చేశారు. అయితే తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నాల్గవ సారి జగన్ కు చెందిన 749 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. లోటస్ పాండ్ తో సహా, బెంగళూరులోని ప్యాలెస్ ను కూడా ఈడీ అటాచ్ చేసింది. మాటలు కోటలు దాటినా కాళ్లు మాత్రం గడప దాటడం లేదన్నట్లు గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు ఆస్తులను ప్రభుత్వపరంగా చెయ్యడానికి ఇది సరైన టైం కానీ.. బాబు గారు మాత్రం దానికి ముందుకు రావడం లేదు.

జగన్ ఆస్తులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఎప్పుడూ వార్తలు రాసే సాక్షి మీడియాను టార్గెట్ చేశారు. అందుకే ఖచ్చితంగా సాక్షి మీడియాను ప్రభుత్వపరం చేస్తామని… అది ప్రజల ఆస్తి అని ముందు నుండి కూడా చంద్రబాబు అంటున్నారు. మరి ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు జగన్ కు చెందిన అన్ని ఆస్తులను ప్రభుత్వపరం చేసుకోవచ్చు కదా అని వాదన వినిపిస్తోంది. కేంద్రంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి పార్టీనే. పైగా మోదీ, చంద్రబాబు మంచి స్నేహితులు అనే వార్త కూడా ఉంది. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఈ దిశగా ఎందుకు అడుగులు వెయ్యలేకపోతున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చసాగుతోంది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పటికే జగన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారని, ఇప్పుడు జగన్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేస్తే ఖచ్చితంగా విపరీత పరిణామాలు తప్పవని బాబు సన్నిహితులు హెచ్చరిస్తున్నారట. అందుకే బాబు దీనిపై కాస్త వెనక్కి తగ్గినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పైగా కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ అనుకున్న రీతిలో సహకరించడం లేదని…. అనవసరంగా ప్రయత్నించి ఎందుకు పేరు పోగొట్టుకోవాలని కూడా బాబు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు దూరమైన ఓ వర్గం జగన్ కు అనుకూలంగా మారిందని… ఈ టైంలో జగన్ ను టచ్ చేస్తే ఆ సామాజిక వర్గం ఆగ్రహం ఎదుర్కోవలసి వస్తుందని కూడా చంద్రబాబు అడుగు ముందుకు వెయ్యడం లేదని తెలుస్తోంది.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఆ అద్భుతానికి పాతికేళ్లు
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
అప్పుడు కక్కుర్తి.. ఇప్పుడు కూల్చివేత?
తొక్కితే తాటతీస్తారు
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పిట్టల దొరను మించిన మాటల దొర
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments