ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా

Poratam3

తెలుగు వాడు ఎక్కడ ఉన్నా ఎలుగెత్తి బ్రతకాలి అన్నదే తెలుగోడ లక్ష్యం. అలాంటి లక్ష్యంతో ముందుకు దూసుకెళుతున్న మాకు ఓ ఆసక్తికర ఆలోచన వచ్చింది. అదే ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం మీద జరుగుతున్న పోరాటం.. చేస్తున్న విధానం. లక్ష్యం ఒక్కటే కానీ దారులు వేరే.. అయినా కూడా ఏదో ఒక దారిన లక్ష్యాన్ని చేరాలి. ఇది మామూలుగా అయితే ఓకే కానీ రాజకీయంగా మాత్రం అలా కుదరదు. ఒంటి వేలు ఉంటే అందరూ వేలెత్తి చూపుతారు.. అదే వేళ్లను పిడికిలిగా మలిస్తే ఎవరూ దాన్ని ప్రశ్నించరు. అలా పిడికిలి బిగించి సీమాంధ్రులు తమ లక్ష్యమైన ప్రత్యేక హోదాను సాధించాల్సిన అవసరం ఉంది.

ఏపిలో ప్రస్తుతం అందరూ ఎత్తుకున్న పాట ఒక్కటే ప్రత్యేక హోదా. ఎవరి చిత్తశుద్దిని ఇక్కడ ప్రశ్నించడానికి లేదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో కాస్త అడుగులు అందరితో కలిసి వేస్తే లక్ష్యం మరింత చేరవుతుందని అనిపిస్తోంది. వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పటికే ఆంధ్రుల హక్కు.. ప్రత్యేక హోదా అంటూ పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే దీక్షలు కూడా చేసిన జగన్ రాజకీయంగా తన ఎంపీల ద్వారా కూడా పార్లమెంట్ లో వత్తిడి తీసుకువచ్చారు. ఎన్నో వేదికల మీద ఏపికి ప్రత్యేక హోదా ఒక్కటే ఆక్సిజన్ అవుతుంది అని కూడా అన్నారు. మరి అలాంటి ప్రత్యేక హోదా కోసం తన వరకు బాగానే కష్టపడుతున్నారు జగన్.

ఇక కొన్నాళ్లు పొలిటికల్ పార్టీని నడిపి ప్రస్తుతం దాన్ని కేవలం ఓ ఆర్గనైజేషన్ గా నడుపుతున్న లోక్ సత్తాపార్టీ అధినేత జెపి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. అయితే జెపి పోరాటం ప్రత్యక్షంగా ప్రజల మధ్యన కాకుండా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటి..? దాని వల్ల ఏం జరుగుతుంది..? అన్న విషయాలపై వివరాలతో కూడిన పోస్టులు పెడుతూ తన స్టైల్లో తాను పోరాడుతున్నారు. టీవీల్లో, మీడియా పాయింట్ల వద్ద ఇంటర్వ్యూల ద్వారా ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిస్తున్నారు జెపి.

JP

ఇక ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై గళమెత్తారు. తిరుపతి వేదికగా పవన్ ప్రత్యేక హోదా కోసం తాను ముందుంటానని అన్నారు. ప్రత్యేక హోదా నాడు ఇస్తానని ఇప్పుడు మాత్రం కుదరదు అని అంటున్నారని పవన్ అంటున్నారు. మొత్తంగా పవన్ కూడా ప్రత్యేక హోదా కోసమే పోరాటాన్ని కొత్తగా మొదలుపెట్టారు. కాగా ముగ్గురు వ్యక్తులు.. అది కూడా బలమైన శక్తులుగా ఎదిగిన వాళ్లు విడివిడిగా పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసమే ఈ ముగ్గురి పోరాటం.

అయితే తెలుగోడ ఒక్కటే ఆలోచిస్తోంది.. లక్ష్యం ఒక్కటే అయినప్పుడు ఒక్కటిగా పోరాడితే ఎంతో మంచిది అని. ఏపికి ప్రత్యేక హోదా రావడమే జగన్, జెపి, పవన్ ల ఉమ్మడి లక్ష్యం అయినప్పుడు విడివిడిగా ఎందుకు పోరాడటం..? ఒక్కటిగా పోరాడవచ్చు కదా. అలా చేస్తే బలమూ పెరుగుతుంది… పోరాటం స్పీడూ పెరుగుతుంది. కానీ ఇక్కడ ముగ్గురు కూడా తమ తమ పంథాలో వెళుతున్నారు. జగన్ క్రెడిట్ మొత్తం వైసీపీకే దక్కాలని చూస్తున్నారు. జెపి ప్రత్యేక హోదా గురించి లాభాపేక్షలేకుండా ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత తన పార్టీకి, తనకు ప్రత్యేక హోదా మంచి మైలేజ్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు తమ పొలిటికల్ గ్రాఫ్ ను పెంచుకోవడానికి ప్రత్యేక హోదాను భావిస్తున్నారు.

అలా కాకుండా పొలిటికల్ ప్రయోజనాలను  ఉన్నప్పటికీ జగన్ పవన్, జెపిని గుర్తించాలి, ప్రజలకు తెలియజేయాలి. అలాగే పవన్ కూడా జగన్ చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తే ..  చాలు ఖచ్చితంగా అది సఫలమవుతుంది. అలాగే జెపి కూడా..  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పక్షాలు కూడా జెఎసిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా అయితే పోరాడాయో ఏపిలో కూడా ఈ ముగ్గురు కలిస్తే మరింత  ప్రయోజనం చేకూరుతుంది. ఇక్కడ తమకు లాభం కలగదేమో అనే భయం అక్కర్లేదు. ఎందుకు అంటే ప్రజలు ఎవరు ఎంత కష్టపడుతున్నారు అన్న అంశాలను గమనిస్తూనే ఉంటారు. ఎవరి కష్టం వృధా కాదు కాబట్టి ఈ ముగ్గురు కలిసి పోరాటం చేసి ప్రభుత్వాలపై వత్తిడి తీసుకువస్తారని తెలుగోడ ఆశిస్తోంది.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
ఇదే జగ‘నిజం’
సింధూరంలో రాజకీయం
చంద్రుడి మాయ Diversion Master
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ప్రత్యేక హోదా లాభాలు
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
ఇక యుద్ధమే కానీ..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

Comments

comments