రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?

Why Modi announce Currency Decision in Night

దేశం మొత్తం షాక్ తిన్న వార్త. ఆఫీసుల నుండి వచ్చిన సగటు ఉద్యోగి తీరిగ్గా వార్తలు చూద్దామని టీవీ పెడితే మోదీ పెద్ద బాంబ్ పేల్చాడు. మొన్న రాత్రి 8 గంటల తర్వాత మోదీ లైవ్ లో మాట్లాడుతూ దేశానికి షాకిచ్చే వార్తను వెల్లడించాడు. అయినా దేశాన్ని కొత్త మలుపు తిప్పిన మోదీ ప్రకటన ఆ రాత్రిపూట ఎందుకు ప్రకటించారు అనే డౌట్ చాలా మందికి వచ్చింది. 500, 1000 నోట్ల రద్దు చేస్తూ మోదీ రాత్రి 8.30కు ప్రకటన చేశారు. ఇలా మోదీ ఆ టైంలోనే ఎందుకు ప్రకటన చేశారంటే..

మన దేశంలో అన్ని బ్యాంకుల్లోనూ ఐదు గంటలకల్లా కార్యకలాపాలు ముగిసిపోతాయి. ఆ తర్వాత ఆయా బ్యాంకుల్లో ఎనెన్ని వెయ్యి నోట్లు.. ఐదు వందల నోట్లు.. వంద నోట్లతో కలిపి మొత్తం నగదు ఎంత ఉందో రాత్రి ఎనిమిది గంటల్లోపు చెస్ట్‌ (ఆర్బీఐ ఖజానా)కు వివరాలు అందించాల్సి ఉంటుంది. అన్ని చెస్ట్‌ల నుంచి వచ్చిన సమాచారంతో ఆ రోజు ఏఏ బ్యాంక్ లలో ఎంత క్యాష్‌ ఉందనేది ఆర్బీఐకి తెలుస్తుంది. ఇలా బ్యాంకుల నుంచి చెస్ట్‌కు సమాచారం వచ్చిన తర్వాతే మోదీ ప్రకటన చేశారు.

మోదీ ఇలా ప్రకటన చెయ్యడానికి ప్రధాన కారణం.. చివరి నిమిషంలో, రాత్రికిరాత్రి కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండడమేనని సమాచారం. పెద్ద నోట్లను రద్దు చేశారని తెలిసిన వెంటనే బడా బాబులు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లను ఆశ్రయిస్తారు. రాత్రికి రాత్రే మేనేజర్ల సహకారంతో పెద్ద నోట్లను బ్యాంకులకు బదిలీ చేసి, వంద, యాభై నోట్లను మార్చేసుకుంటారు. దేశవ్యాప్తంగా ఇలా కొన్ని వందల కోట్ల రూపాయల నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మారే ప్రమాదం ఉంది.. అదే జరిగితే, నల్ల ధనంపై ప్రభుత్వ లక్ష్యం నేరవేరదు. అంతేకాదు.. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ముందుగానే ప్రకటిస్తే… బడా బాబులలు తమ వద్ద ఉన్న నల్ల డబ్బుతో పెద్ద ఎత్తున బంగారం కొనేస్తారు.. ఆ విషయం దృష్టిలో ఉంచుకొని బంగారం షాపులు మూటపడే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ రాత్రి 8 గంటలు దాటాక ప్రకటన చేశారని బ్యాంకింగు వర్గాలు వివరిస్తున్నాయి.

కాగా ఆ ప్రకటన ప్రభావం వెంటనే షేర్‌ మార్కెట్‌పై పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో బెట్టింగ్ బంగార్రాజుల పనిపట్టారు మోదీ. అమెరికా ఎన్నికలపై కొన్ని వేల కోట్ల బెట్టింగ్‌లు జరిగాయి. వాటి ఫలితాలు రాత్రి ఒంటిగంట నుంచి రావడం ప్రారంభమయ్యాయి. కానీ, అర్ధరాత్రి 12 గంటల నుంచే కరెన్సీకి విలువ లేకుండా చేసేశారు. కాగా, పెద్ద నోట్ల ప్రకటనకు ముందు మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. దాంతో, అందరూ మరోసారి సర్జికల్‌ చేస్తారనో, మరొకటో అంచనా వేశారు. కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత శాంతి భద్రతల సమస్య తలెత్తితే దానిని నివారించడానికే వారితో సమావేశమయ్యారని సమాచారం.

Related posts:
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ఆ అరుపులేంటి..?
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ఎవరు చాణిక్యులు..?
మద్యల నీ గోలేంది..?
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పవన్ క్షమాపణలు చెప్పాలి

Comments

comments