మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Why Modi fears in Parliament

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటకారితనం గురించి అందరికి తెలిసిందే. బిజెపి పార్టీలో అంతకంతకు పెరిగి, చివరకు ప్రధాని పీఠంపై కూర్చున్నారు అంటే అది ఖచ్చితంగా మోదీగారి మాటతీరు వల్లే. ఏ విషయాన్నైనా మామూలు వ్యక్తికి కూడా అర్థమయ్యేలా మాట్లాడే వ్యక్తి మోదీ. అయితే గత ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మోదీ పేల్చిన వ్యంగాస్ర్తాలు ఇప్పటికీ చాలా మందికి గుర్తున్నాయి. అయితే తాజాగా మోదీ పార్లమెంట్ సభలో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రతిపక్షాలు ప్రధాని దీనిపై సమాధానం చెప్పాలని ఎంతలా పేచిపెట్టినా కానీ  మోదీ పెడచెవిన పెడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలది ఒక్కటే డిమాండ్. డీమానిటైజేషన్ పై మోదీ పార్లమెంట్ లో సమాధానం చెప్పాలి అని. కానీ మోదీ మాత్రం అసలు సభకే సరిగా హాజరుకావడంలేదు. రాజ్యసభకు ఏదో అలా వచ్చి మమఅనిపించుకుంటున్నారు తప్పితే పెద్దగా స్పందిచింన దాఖలు మాత్రం లేవు. అయితే మోదీ ఎన్నికల ప్రచారంలో మాత్రం జోరుగా ఉన్నారు. తన నిర్ణయం వల్ల నల్లకుబేరులు బ్యాంకుల ముందు క్యుకడుతున్నారని అన్నారు. అయితే పార్లమెంట్ లో మాట్లాడని మోదీ.. బహిరంగ సభల్లో మాత్రం అంతలా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? అనేది ప్రశ్న.

మోదీ పార్లమెంట్ లో మౌనమునిగా మారడానికి కారణం ఎందుకు? గతంలో మన్మోహన్ మౌనంగా ఉంటే గేలిచేసిన బిజెపి నాయకులు ఇప్పుడు మోదీ చేస్తున్నది మాత్రం కనిపించడంలేదా? అయితే నిజంగా ప్రధాని మోదీ జనాలకు మంచే చేస్తే భయం ఎందుకు? భారత ప్రజల కోసమే నేను ఇంత చేస్తున్నాను అని బహిరంగ సభల్లో తెగ అరిచే మోదీ… ప్రతిపక్షాలు నిలదీస్తున్నా కానీ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడటం లేదు? మోదీ చేస్తున్నది నిజంగా మంచేనా అనే అనుమానాలకు అతడి మౌనమే కారణం అవుతోంది.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
లోకేష్ గ్యారేజ్.. పార్టీకి రిపేర్లు చెయ్యబడును
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
పవన్ చంద్రుడి చక్రమే
ఆ అరుపులేంటి..?
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
పట్టిసీమ వరమా..? వృధానా..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments