వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?

Why people announcing reward for Killing or something harm

ఈ మధ్యన చంపేస్తే రివార్డులు అనే ప్రకటనలు బాగా పెరిగిపోయాయి. అప్పుడెప్పుడో దిల్లీ యూనివర్సిటీలో కన్హయ కుమార్ ను చెప్పుతో కొడితే లక్ష రూపాయలు అని, కేజ్రీవాల్ పై గుడ్డు విసిరితే లక్ష అని , అసదుద్దీన్ ఓవైసీ నాలుక చీలిస్తే పాతిక లక్షలు అని తాజాగా జకీరర్ నాయక్ ను చంపేస్తే పదిహేను లక్షలు అనే ప్రకటన వచ్చింది. మరి ఇలాంటి ప్రకటనలు చెయ్యడానికి కారణం ఏంటి..? అంత అవసరం ఏంటి..? అనే దానిపై ఖచ్చితంగా ఆలోచించాలి. పలానా ఓవైసీనో లేదంటే జకీర్ నో చంపితే వచ్చేది ఏముంది..?

భారతదేశం విశాలపైమైంది.. మన రాజ్జాంగం అంతకన్నా విశాలమైంది కాబట్టే దేశంలోని అందరికి న్యాయంగా నేనున్నా అనే భరోసానిస్తోంది. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ నాయకులు చాలా మంది ప్రజలను రెచ్చగొట్టేప్రయత్నం చేస్తున్నారు. అలా చెయ్యడం వల్ల ఘర్షణలకు అవకాశం కలుగుతుంది. సాధ్వి ప్రాచి, యోగేంద్ర మహారాజ్, ప్రవీణ్ కుమార్ తొగాడియా, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, జకీర్ నాయక్ లాంటి వాళ్ల ప్రసంగాల వల్ల చాలా మంది ప్రభావితం అవుతున్నారు. అయితే వాళ్లు చేసే వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా చాలా కేసులు నమోదవుతుండగా.. మరికొన్ని చోట్ల, కొంత మంది వ్యక్తులు ఇలా చంపేస్తే లేదంటే వాళ్లకు చెడు చేస్తే రివార్డులు అని ప్రకటిస్తున్నారు.

నిజానికి రివార్డులు ప్రకటించే వారికి పెద్దగా డబ్బులు కూడా ఉండవు. కేవలం మీడియాలో ప్రచారం కోసం మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారు. అప్పటికే వివాదం మీడియా తెర మీద ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం వల్ల వాళ్లకు కూడా పాపులారిటీ వస్తుంది అన్నది వాళ్ల స్ట్రాటజీ. తాజాగా ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్‌ హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా యూపీకి చెందిన హుస్సేనీ టైగర్స్ జకీర్ నాయక్ పై రివార్డ్ మనీ ఆఫర్ చేసింది. జకీర్‌ను చంపితే రూ.15లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.  తాజాగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) మాజీ నేత ‘సాధ్వీ ప్రాచీ’ ఆ ధరను అమాంతం పెంచేశారు. జకీర్ తల తెగ నరికిన వారికి తాను రూ.50 లక్షలు బహుమానంగా ఇస్తానని ఆమె నిన్న ఉత్తరాఖండ్ లోని రూర్కీలో సంచలన ప్రకటన చేశారు.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
జీఎస్టీ బిల్ కథ..
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
అడకత్తెరలో కేసీఆర్
చిరుకు పవన్ అందుకే దూరం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
ఆ అరుపులేంటి..?
మూడింటికి తేడా ఏంటి..?
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
పిట్టల దొరను మించిన మాటల దొర
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
జగన్ క్రిస్టియన్ కాదా!
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
మోదీ భజన అందుకేనా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments