మోదీ భజన అందుకేనా?

Why Telanagana cm KCR praises Narendra Modi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోదీని తెగ పొగిడేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం (Demonetisation) తర్వాత మోదీని పొగిడిన వాళ్లలో కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. మోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైంది అంటూ, తమ పూర్తి మద్దతు ఉంటుందని, తెలంగాణ యువత ఆయన వెంట నడుస్తుంది అని హామీ ఇచ్చారు. మోదీని మెచ్చుకోవడంతో ఊరుకోకుండా ఏకంగా సిద్ధిపేటను క్యాష్ లెస్ నియోజక వర్గంగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద రెడీ చెయ్యడానికి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిజానికి మోదీ నిర్ణయానికి ముందు కేసీఆర్ కేంద్రం మీద తెగ విమర్శలు చేశారు. కానీ తర్వాత ఇంతలా సీన్ ఎందుకు మారింది అనేది ప్రశ్న.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. బి.జె.పితో కేసీఆర్ ముందు నుండి ఎలాంటి పొత్తుపెట్టుకోలేదు.. పైగా మోదీకి తన మద్దతు కూడా తెలపలేదు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చెయ్యడంలేదని కేసీఆర్ ఎన్నోసార్లు మీడియా ముఖంగా విమర్శలు చేశారు. మోదీతో సహా పలువురు  కేంద్ర మంత్రులను కలిసిన ఆయన తెలంగాణకు రావాల్సిన నిధుల మీద వినతి పత్రాలు సమర్పించారు. కానీ ఎవరూ స్పందించడంలేదని కేసీఆర్ ఎన్నోసార్లు ఫిర్యాదు కూడా చేశారు.

తాజాగా మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేసీఆర్ దిల్లీ వెళ్లివచ్చారు. పెద్దనోట్ల ప్రభావం ఎలా ఉంది? అనే అంశం మీద కేసీఆర్ మోదీతో చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత మోదీ హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ లో కేసీఆర్ తో మాట్లాడారు. ఈ రెండు మీటింగ్ ల తర్వాత కేసీఆర్ పెద్దనోట్ల ప్రభావం తెలంగాణ మీద ఎలా ఉంది అనే అంశంపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇక సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మోదీ భజన చేశారు. అసలు మోదీ తీసుకువచ్చిన పెద్దనోట్ల రద్దు సూపర్ అంటూ కితాబిచ్చారు. అయితే కేసీఆర్ ఇలా మాట్లాడటానికి మోదీతో అంతర్గతంగా కొన్ని ఒప్పందాలు జరిగి ఉండవచ్చు అనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.

మోదీని నారా చంద్రబాబు నాయుడు పొగిడారు అంటే అది మామూలే. ఎందుకంటే మోదీతో చంద్రబాబు నాయుడు మిత్రపపక్షంలో భాగంగా మిత్రులుగా ఉన్నారు కాబట్టి. కానీ కేసీఆర్ మాత్రం అలా కాదు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీతో రహస్యంగా ఒప్పందాలు చేసికుని ఉండవచ్చు అని సమాచారం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ముందు నుండి డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టుల నిధులు విడుదలచేస్తామని మోదీ నుండి హామీ పొందిఉండవచ్చు అని సమాచారం. పెద్దనోట్ల రద్దుతో తెలంగాణకు దాదాపుగా మూడు వేల కోట్ల నష్టం వాటిల్లింది అని సమాచారం. ఆ మొత్తం నష్టాన్ని కేంద్రం భరించడానికి మోదీ హామీ ఇచ్చి ఉండవచ్చు అని మరో వార్త.

పైగా కేసీఆర్ తెలంగాణ ప్రజానికానికి చాలా హామీలు ఇచ్చి ఉన్నాడు. వాటికి ఎలాగూ నిధులు కావాలి కాబట్టి మోదీతో ఒప్పందానికి ముందుకు వచ్చి ఉంటారు. అలాగే పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్రానికి భారీగా నిధులు చేకూరాయి. దాంతో రాష్ట్రాలకు నిధులు కాస్త ఎక్కువ కేటాయించాలని నిర్ణయించి ఉండవచ్చు. వాటిలో తెలంగాణకు ప్రయార్టీ ఇస్తుండవచ్చు. కాగా ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ కేసీఆర్ వైఖరి మాత్రం మారింది అన్నది క్లీయర్. మామూలుగా అయితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, మా రాష్ట్రానికి పలానా తేదీలోగా ఇంత చిల్లర కావాలి అని డిమాండ్ పెడతారు. కానీ కేసీఆర్ అలా చెయ్యకపోవడమే కాక మోదీ భజన చెయ్యడం ఒప్పందం వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
చిరుకు పవన్ అందుకే దూరం
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
మూడింటికి తేడా ఏంటి..?
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
చెత్త టీంతో చంద్రబాబు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
జగన్ క్రిస్టియన్ కాదా!
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments