ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?

Why Terrorists targetting Hyderabad

దేశంలో ఉగ్రవాదుల దాడి.. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉగ్రవాదుల ఘాతుకం. దిల్ సుఖ్ నగర్ లో బాంబ్ పేలుళ్లు… లాంటి వార్తలను ఎప్పుడు విన్నా కానీ హైదరాబాద్ పేరు ఎక్కడో చోట వినిపిస్తుంది. అంతలా హైదరాబాద్ పేరు ఎందుకు ప్రతీసారి వినిపిస్తుంది అనే అంశం మీద చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ లేకుండా ఉగ్రదాడుల కేసును క్లోజ్ చెయ్యలేం అని చాలా మంది ఉన్నతాధికారులు అంటుంటే అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. మరి అంతలా హైదరాబాద్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? అనే వాటిపై కొన్ని విషయాలు తెలుగోడి కోసం..

– హైదరాబాద్లో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్లతో పాటుగా, విదేశాలకు చెందిన వాళ్లు కూడా ఉంటుంటారు. కాబట్టే ఎక్కువగా ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తున్నారు.
– హైదరాబాద్లో ఓ వర్గానికి చెందిన వాళ్లు ఎక్కడో దీనికి వంతపాడుతున్నారు అనే వాదనలో కూడా బలం ఉంది.
– నిఘా సంస్థల నిఘా ఎప్పుడూ ముంబై, చెన్నై, బెంగళూరు, దిల్లీ, కోల్ కత్తాలాంటి నగరాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. కానీ హైదరాబాద్ పై నిఘా లోపించింది అనే భావన ముందు నుండి ఉగ్రవాదులకు తెలిసి ఉండవచ్చు.
– హైదరాబాద్లో స్థానికులకు, విదేశీలకు మధ్య పెద్దగా గ్యాప్ లేకుండాపోవడంతో ఎవరు ఎవరు..? అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఇది ఉగ్రవాదులకు కలిసివచ్చే పాయింట్.
– తాజాగా ఉగ్రవాదులు ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాను టార్గెట్ గా చెయ్యడం చూస్తే వాళ్లు ఆస్తి నష్టంతో పాటుగా భారీగా ఆర్థిక నష్టానికి ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. ఇండియాలో బెంగళూరు తర్వాత ఐటి హబ్ గా హైదరాబాద్ ఉంది కాబట్టి టార్గెట్ అయి ఉండవచ్చు.

ఏం జరిగింది:
ఐసిస్ సానుభూతి పరులు అంటూ గతకొంత కాలంగా నిఘా ఉంచిన ఎన్ఐఎ వారి గురించి పక్క సమాచారం అందుకొని హైదరాబాద్ లో స్థానిక పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.  సౌత్ ఇండియా మాడ్యూల్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఇబ్రహీం సహా 11 మంది ఐఎస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన వీరిలో ఒక టెక్కీతోపాటు.. పలువురు గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. వీరంతా 20-30 ఏళ్ల మధ్య వయస్కులు, బంధువులే కావడం విశేషం. ఇబ్రహీం తన సోదరుడు మహ్మద్ ఇలియాజ్ యాజ్దానీ, మరో 9మంది బంధువులతో మాడ్యూల్‌గా ఏర్పడినట్టు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

ISIS-Terrorist-list

ఎలా సాధ్యం:
హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహమూద్ ఇబ్రహీం ఫేస్‌బుక్‌లో ఐఎస్ ప్రేరేపిత రెండు అకౌంట్లు ఓపెన్‌చేశాడు. ఈ అకౌంట్లద్వారా యువతను రెచ్చగొడుతూ సిరియా యుద్ధంలో పాల్గొనాలంటూ ఆకర్షిస్తూ వచ్చాడు. ఇలా ఆరు నెలల నుంచి సోషల్ నెట్‌వర్క్ ద్వారా సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన ఇబ్రహీం వారం క్రితం రెండు అకౌంట్లను రద్దు చేశాడు. దీంతో అనుమానించిన నిఘా వర్గాలు ఇబ్రహీం ఎవవరితో ఫేస్‌బుక్‌లో చాట్ చేశాడు? వారి ఐపీ అడ్రస్‌లు, వారు సాగించిన సంభాషణలను పూర్తిస్థాయిలో సేకరించి, సమాచారాన్ని రాష్ట్ర పోలీసులకు అందించాయి. అప్రమత్తమైన రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు హైదరాబాద్ నగర పోలీసులు, ఎన్‌ఐఏతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

మరో కోణం:
ఈ సారి ఉగ్రవాదులు దాడులతో పాటుగా అదే టైంలో అల్లర్లకు పాల్పడి గందగోళం మధ్యన అధిక ప్రాణనష్టాన్ని కలిగించాలని ప్లాన్ వేశారు. ఇలాంటి ప్లాన్ గతంలో ఎన్నడూ కూడా లేదు.

పరిష్కారం:
– ఆధార్ కార్డు ఉంటేనే ఇల్లు అద్దెకు ఇవ్వాలి అని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
– గతంలో రికార్డులకెక్కిన అందరి క్రిమినల్ హిస్టరీని డిజిటలైజ్ చేసి, వారి ఫింగర్ ప్రింట్స్, ఐబ్రోస్ ను కలెక్ట్ చెయ్యడం
– ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదులతో సంబందం ఉంది అని తేలితే శిక్షలను వెంటనే అమలు చెయ్యడం
– అన్నింటికి మించి నిరుద్యోగ యువత ఉగ్రవాద భావజాలానికి దగ్గర కాకుండా జాగ్రత్తపడటం

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
ఆ అద్భుతానికి పాతికేళ్లు
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
చంద్రుడి మాయ Diversion Master
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
ఇక యుద్ధమే కానీ..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తొక్కితే తాటతీస్తారు
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
మెరుపు దాడి... నిజమా-కాదా?
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments