ఆ అరుపులేంటి..?

Why was Pawan Kalyan shouting

పవర్ స్టార్ గా తెలుగు తెర మీద మంచి గుర్తింపున్న పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీని స్థాపించేందుకు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ తర్వాత దాదాపుగా రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో సభ నిర్వహించారు. మొన్నటి దాకా కిమ్మనకుండా కూర్చున్న పవన్ ఒక్కసారిగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం.. అది కూడా ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమాలో ఫీట్లు చేసిన మాదిరి చేస్తుండటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తిరుపతి సభలో పవన్ మాట్లాడిన తీరు కొంత మంది ఆవేశం అనుకుంటే మరికొంత మంది మాత్రం అరుపులు అంటున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడుతున్నారు. రాయలసీమకు చెందిన మంత్రి టిజీ వెంకటేష్ ఏకంగా కాళ్లు విరుగుతాయి అన్నట్లు మాట్లాడారు. ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడితే కుదరదు అని టిజీ అన్నారు. ఇదే తమిళనాడులో మాట్లాడి ఉంటే జయలలిత పవన్ కాళ్లు విరగ్గొట్టేది అని అన్నారు.

ఇప్పటి దాకా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడని పవన్ ఒక్కసారిగా వచ్చి రాజీనామాలు చెయ్యమంటే చెయ్యాలా..? అని ప్రశ్నించారు. పైగా దీక్షల వల్ల వచ్చేదేమీ లేదు అన్న పవన్ రోడ్ల మీదకు జనాలు రావాలని పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు. దీక్షల వల్ల కాకపోతే పవన్ అరుపుల వల్ల సాధ్యమవుతుందా..? అని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడుతున్నాయని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. సిపిఐ నారాయణ కూడా పవన్ తీరుపై స్పందించారు. పవన్ చేసుకుంటే రజినీకాంత్ లాగా ఇంట్లో కూర్చొని సినిమాలు చేసుకోవాలని.. పరిణతిలేని మాటలు మాట్లాడకూడదు అని ఆయన అన్నారు.

తిరుపతి సభలో పవన్ మాట్లాడిన విధానాన్ని గమనించి వాళ్లందరికి ఒక్కటే అర్థంకాలేదు. పవన్ చెప్పాలనుకున్న అంశాలను ప్రశాంతంగా చెప్పొచ్చుకదా.. గుండెలు బాదుకుంటూ మాట్లాడటం ఎందుకు అని అంటున్నారు. పోనీ పవన్ మాట్లాడుతుంటే జనాల్లో ఏమైనా కదలిక ఉందా అంటే కేవలం ఆ ఫీట్లను చూస్తున్నారు తప్పితే ఎవరూ కూడా దానిపై స్పందించలేదు అలాగే ఎవరూ ఆయనతో గొంతుకదపలేదు. సినిమాల్లో మాదిరిగా అరిస్తే ఏదో జరుగుతుంది అని అనుకోవడం పవన్ పొరపాటు. అలాగే పవన్ మాట్లాడేటైంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించి ఉంటే కాస్త సినిమా స్టైల్లో ఎఫెక్ట్ గా ఉండేది. వచ్చిన వాళ్లైనా కనీసం ఆనందించే వాళ్లు అని పవన్ మీద సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా పవన్ అరుపుల వల్ల ఒక్కరు మాత్రం స్పూర్తిని పొందినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కానీ సుజనా పవన్ లాగా అరవకుండా ప్రశాంతంగా తన డిమాండ్ ను పార్లమెంట్ లో వినిపించారు.

Related posts:
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
పవన్ మాస్టర్ స్కెచ్
ఇక యుద్ధమే కానీ..
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
పైసలు వసూల్ కాలేదుగా..
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments