ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?

Chandrababu-post

చంద్రబాబు నాయుడుకు చమటలు పడుతున్నాయా…? కేసు విచారిస్తే మొత్తం వ్యవహారం బట్టబయలు అవుతుందని భయపడుతున్నారా..? ఏపిలో చంద్రబాబు సర్కార్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయా..? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందా..? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..? ఇప్పుడు ఏపి రాజకీయ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు కేసు విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఆదేశాలతో చంద్రబాబు నాయుడులో వణుకు మొదలైందని తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పాలన బాధ్యతలు కంటే కూడా అధికంగా ఓటుకు నోటు కేసుపై దృష్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. తెలుగు దేశం పార్టీ నాయకులు అంతా కూడా ప్రస్తుతం ఈ కేసు నుండి తమ బాబును ఎలా బయట పడేలా అని ఆలోచిస్తున్నారు. పీకల మీదకు వచ్చిన కేసును కేసీఆర్‌తో మాట్లాడి దించేసుకున్న చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మళ్లీ ఆ కేసు తిరగదోడటంతో చెమటలు పడుతున్నట్లుగా ప్రతిపక్ష వైకాపా నేతలు చిరునవ్వులు చిందిస్తూ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు నుండి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అంటూ తాజాగా వైకాపా సీనియర్‌ నేత అంబటి రాంబాబు అన్నారు.

ఏసీబీ కోర్టు ఉత్తర్వుల పైన స్టే విధించాలని ఆయన పిటిషన్ వేశారు. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల నాని రామకృష్ణా రెడ్డి నేరుగా ఏసీబీ కోర్టుకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం దీని పైన రేపు విచారించే అవకాశాలున్నాయి. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల పైన స్టే ఇవ్వాలని హైకోర్టులో చంద్రబాబు డిఫెన్స్ పిటిషన్ వేయగా.. దానిని కోర్టు అనుమతించింది. మరి దీనిపై కౌంటర్ అటాక్ కోసం ఏసీబీ కూడా సిద్ధమైంది. ఏసీబీ డిజి ఏకే ఖాన్ ఇప్పటికే గవర్నర్ నరసింహన్ ను కలవడం.. ఏసీబీ విచారణలో ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తోంది.

కాగా తెలంగాణ ఏసీబీ ఏకే ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓటుకు నోటు కేసుపై ఓ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరెవరైతే ఈ కేసుతో ముడి పడి ఉన్నారో వారిని ఈ టీం ప్రత్యేకంగా విచారిస్తుందని.. వారి వివరాలను సేకరించడంలో న్యాయపరంగా కూడా ఈ టీంకు ఎలాంటి అడ్డులేకుండా తెలంగాణ సర్కార్ ఫుల్ పర్మిషన్ ఇస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

విపక్షాల ఎదురుదాడితో పాటు మీదకు వస్తున్న కేసుతో నిజంగానే చంద్రబాబుకు ముచ్చెమటు పడుతున్నాయి. ఓటుకు నోటు కేసు ఇక సమసిపోయినట్లే అని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడుకి మళ్లీ తీవ్ర తలనొప్పి ప్రారంభం అయ్యింది. రేవంత్‌ రెడ్డిని ప్రస్తుతం విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడును కూడా విచారిస్తారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అలా గనక జరిగితే మాత్రం ‘నిప్పు’ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు పరువు పోతుంది… కేసులో బాబుగారు దోషిగా తేలితే మాత్రం పదవి కూడా ఊడుతుంది. మరి ఓటుకు నోటు కేసులో పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఏపి సిఎంగా నారా లోకేష్
ఓటుకు నోటు కేసును మూసేశారా?

Comments

comments