వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?

Will CMs die if rains

నమ్మకం వేరే.. మూడనమ్మకం వేరే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది నమ్మకమో.. ఏది మూడనమ్మకమో అర్థంకాని గతి. చాలా మంది నమ్మకాలను వక్రీకరించి.. మూడనమ్మకాలుగా మారుస్తున్నారు. భవిష్య వాణి గురించి చాలా మందికి నమ్మకం ఉంది కానీ అంతకన్నా ఇది ఓ మూడనమ్మకం అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ నమ్మకం, మూడనమ్మకం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే.. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు త్వరలో ప్రాణగండం ఉందని ఓ భవిష్యవాణి వినిపించాడు ఓ జ్యోతిష్యుడు. అసలు ఏంటీ మ్యాటర్ అంటే..

దక్షినాది రాష్ట్రాల్లో బాగా పాపులర్, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు కీలకంగా ఉన్నాయి. కాగా తాజాగా ఓ జ్యోతిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ప్రాణగండం ఉందని వెల్లడించారు. ఈ సెప్టెంబర్ 30 నుండి 2017 సెప్టెంబర్ 30వరకు వారికి గండం ఉందని అన్నారు. కాగా ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. 2007లో కర్నూల్ లో అధికంగా వర్షాలు పడ్డాయని, ఆ తర్వాత వైయస్ చనిపోయారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో వర్షాలు బాగా కురిసాయని, తమిళనాడులో వరదలు పొటెత్తాయని ఆయన అంటున్నారు. ఆ రకంగా ఇద్దరికి ప్రాణగండం ఉంది అని పేర్లు చెప్పకుండానే పరోక్షంగా వెల్లడించారు.

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆరోగ్యం బాగోలేదు. కొద్ది రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు చెబుతున్న మాటలు కూడా ఇదే నేపథ్యంలో సాగుతున్నాయి. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుతానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ ఈ జ్యోతిష్కుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతికూల వాతావరణంలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాప్టర్ లో బయలురేరారు. టెక్నిలక్ ప్రాబ్లం వల్ల అది క్రాష్ కావడం, అందులో వైయస్ చనిపోవడం జరిగింది. కానీ ఇందులో ఎలాంటి జ్యోతిష్యంలేదు. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. పనిలేని కొంత మంది కేవలం పాపులారిటీ కోసం ఇలాంటి పనికిమాలిన అంశాలను తలకెత్తుకుంటున్నారు.ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికీలేదు.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ మాస్టర్ స్కెచ్
పవన్ చంద్రుడి చక్రమే
వెనకడుగు
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మీకో దండం.. ఏం జరుగుతోంది?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
పవన్ క్షమాపణలు చెప్పాలి
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments