అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్

Will DK Aruna get deputy CM post in Telangana

డికె అరుణ.. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజక వర్గం ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన తీరు, టిఆర్ఎస్ హవా కొనసాగుతున్నా తన చరిష్మాను కాపాడుకున్న వైనంతో టిఆర్ఎస్ లో డికె అరుణ గురించి చర్చ సాగుతోంది. కొద్దిరోజుల క్రితం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త జిల్లాలను ప్రకటిస్తే అందులో గద్వాల పేరులేకపోవడంతో ఆమె పోరాటానికి దిగారు. వరుసగా బంద్ లు, ధర్నాలతో నియోజకవర్గ ప్రజలను ఏకం చేసింది. మొత్తానికి ప్రభుత్వం నుండి గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రకటన తర్వాత అరుణ కారెక్కుతారు అని ప్రచారం సాగింది.

గత కొంత కాలంగా మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పట్టు కోసం డీకే అరుణను టీఆర్‌ఎస్‌లోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆమెకు సరైన ప్రాముఖ్యత ఎలా ఇవ్వాలో తెలియక సీఎం కూడా కాస్త వెనుక ముందు ఆలోచించాడట. తాజాగా సీఎం తన మంత్రి వర్గంను పునర్‌ వ్యవస్థీకరించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలో డీకే అరుణను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం డీకే అరుణను టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని ఆమెను ఏకంగా డిప్యూటీ సీఎం పీఠం ఎక్కించాలని కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఇద్దరు డిప్యూటీ సీఎంలలో ఒకరికి ఉద్వాసన తప్పేలా లేదు. ముఖ్యంగా మహమూద్ అలీని అలానే డిప్యూటీ సిఎంగా కొనసాగిస్తూ.. కడియం శ్రీహరిని డిప్యూటీగా తీసివేసి.. ఆ స్థానంలో డికె అరుణను కూర్చోబెట్టాలని అనుకుంటున్నారట. అలా చెయ్యడం ద్వారా మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు అనే అపవాదు దూరంకావడంతో పాటుగా కొత్తగా ఏర్పడుతున్న గద్వాల జిల్లాలో గులాబీ జెండా ఎగురుతుంది అని టిఆర్ఎస్ భారీ స్కెచ్ వేసింది.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఓటుకు నోటు కేసును మూసేశారా?
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments