అకౌంట్లో పదివేలు వస్తాయా?

Will JanDhan Yojagana accounts get ten thousand ruppes

దేశం మొత్తం ఒకటే చర్చ.మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కరెక్టా? కాదా? అని. అయితే సగటు జీవి మాత్రం తనకు మోదీ నిర్ణయం వల్ల కలుగుతున్న కష్టాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. కాగా పెద్ద నోట్లు రద్దుతో ఇబ్బందులు పడుతున్న పేదప్రజలకు కొంత ఊరటనిచ్చే చర్యలకు ఉప‌క్ర‌మిస్తోంది కేంద్ర స‌ర్కార్‌. జ‌మ అయిన న‌ల్ల‌ద‌నాన్ని జ‌న్‌ధ‌న్ అకౌంట్లున్న పేద‌ప్ర‌జ‌ల‌కు 10వేలు చొప్పున ఇచ్చే విష‌య‌మై చ‌ర్చిస్తోంది. దేశంలో 25 కోట్ల జ‌న్‌ధ‌న్ ఖాతాలున్నాయి. వీటిలో 5.8 కోట్ల ఖాతాల్లో రూపాయి కూడా లేదు. ఈ ఖాతాల‌కు రూ.10వేలు వేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌భుత్వానికి  అదే స‌మ‌యంలో, చేతిలో డ‌బ్బు లేక తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న పేద ప్ర‌జ‌ల‌కు ఈ నిర్ణ‌యం మేలు చేస్తుంద‌ని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.  ఒక్క రూపాయి కూడా లేని 5.8 కోట్ల  ఖాతాల్లోకి రూ.10వేలు చొప్పున వేయ‌డానికి ప్ర‌భుత్వానికి అయ్యే ఖ‌ర్చు రూ.58వేల కోట్లు. నోట్ల ర‌ద్దుతో  రూ.3ల‌క్ష‌ల కోట్లు కేంద్ర‌ప్ర‌భుత్వ ఖ‌జానాలో చేరునుంద‌ని అంచ‌నా. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ నిర్ణ‌యంపై ఆగ్ర‌హంగా ఉన్న చిన్న మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లను రూ.10వేలు త‌మ జ‌న‌ధ‌న్ అకౌంట్లోకి వేసి వారిని శాంతింప‌జేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక ర‌చిస్తోంది.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
కాటేసిందని పాముకు శిక్ష
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
ముందే కూయనున్న బడ్జెట్... మోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన
చంద్రబాబు చిన్న చూపు
ఏపీకి ఆ అర్హత లేదా?
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
BSNL లాభం ఎంతో తెలుసా?
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
యాహూ... మీ ఇంటికే డబ్బులు
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments