మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?

Will Modi Get Support From Countries Support for NSG Membership

భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగినా కూడా ఓ పని మాత్రం అవుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు అంటే మోదీ అడుగుపెట్టి ప్రతీ చోట విజయం సాధించాడు అనే ఓ పేరుంది.కానీ ఇప్పుడు పేరుకు డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయా అనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా మ్యాటర్ అనుకుంటున్నారా.? భారత్ కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లో చేర్చే అంశం.అమెరికా దీనికి ఇదువరకే మద్దతు పలకగా.. తాజాగా చైనా మాత్రం రెండు నాలుకల ధోరణితో మనకు షాకిచ్చింది. చైనా పర్యటనకు సిద్దమైన మోదీకి ఇప్పటికే కొన్ని దేశాలు షాకిచ్చాయి.

ప్రతిష్టాత్మక న్యూక్లియర్‌ సప్లయర్స్ గ్రూప్‌ లో చేరాలన్న భారత ప్రయత్నం దాదాపు విఫలమైంది. భారత్‌ కు మద్దతిచ్చే విషయంలో కూటమిలో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌, టర్కీ, నెదర్లాండ్స్ సహా పలు దేశాలు భారత సభ్యత్వాన్ని వ్యతిరేకించాయి. దీంతో మొత్తం 48 దేశాల కూటమిలో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. ఐతే, భవిష్యత్‌ లోనైనా ఎన్‌.ఎస్‌.జి లో చేరేందుకు భారత్‌ కృషి చేయనుంది.

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో జరిగిన ఎన్‌.ఎస్‌.జి ప్లీనరీ సమావేశంలో భారత్ దాఖలు చేసిన సభ్యత్వ బిడ్‌ పై చర్చ జరిగింది. ఐతే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో లేని ఇండియాకు సభ్యత్వం కల్పించటంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధానంగా బ్రెజిల్‌, ఆస్ట్రియా, న్యూజిలాండ్‌, టర్కీ, నెదర్లాండ్స్‌ సహా పలు దేశాలు భారత్‌ కు వ్యతిరేకంగా మాట్లాడాయి. దీంతో ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఐతే ఎన్‌.ఎస్‌.జి ప్లీనరీ కొనసాగనున్న నేపథ్యంలో భారత్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఈ విషయంలో పలు దేశాలను ఒప్పించేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. అమెరికా, స్విట్జర్లాండ్‌, మెక్సికో సహా పలు దేశాధినేతలతో చర్చించి భారత్‌ కు సహకారం అందించేలా కృషి చేశారు. ఐతే, చైనా మాత్రం మొదటి నుంచి ఈ విషయంలో భారత్‌ కు వ్యతిరేకంగా ఉంది. పాకిస్థాన్‌ సైతం చైనా ద్వారా భారత్‌ కు ఎన్.ఎస్‌.జి లో సభ్యత్వం దక్కకుండా ప్రయత్నాలు చేసింది. ఐతే, ఉజ్బెకిస్థాన్‌ లో జరిగిన షాంఘై కో ఆపరేటివ్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పాల్గొనటానికి వెళ్లిన ప్రధాని మోడీ తాష్కెంట్ లో చైనా అధ్యక్షుడు జి జిన్‌ పింగ్ తో భేటీ అయ్యారు. ఎన్‌.ఎస్‌.జి విషయంలో మద్దతు కోరుతూనే… పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. చైనా మాత్రం ఎన్‌.ఎస్‌.జి లో భారత్‌ సభ్యత్వానికి నో చెప్పింది.

అంతర్జాతీయంగా మోదీ కొనసాగిస్తున్న విజయయాత్రకు దాదాపుగా బ్రేక్ పడ్డట్లేకనిపిస్తోంది. అయితే దీన్ని మోదీ అపజయంగా ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే… మోదీ భారత్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాడు. కానీ భారత్ అంటే ఎన్నో దేశాలకు అభిమానం, మరికొన్నింటికి ద్వేషం, మరికొన్నింటికి వ్యాపార వస్తువు. అలా ఎవరి యాంగిల్ లో వాళ్లు చూసుకుంటుంటారు. మరి అలాంటప్పుడు మోదీ వల్లే ఇది సాద్యం కాదు అనే వ్యాఖ్య దీనికి అస్సలు నప్పదు. మోదీ ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎంత వరకు వస్తుందో చూడాలి.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ఉక్కిరిబిక్కిరి
అన్నదమ్ముల సవాల్
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఎవరు చాణిక్యులు..?
మద్యల నీ గోలేంది..?
ప్రత్యేక హోదా లాభాలు
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
జయలలిత జీవిత విశేషాలు
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments