నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!

Will Narendra Modi may loose his power with black money effect

భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం దేశాన్ని కుదిరేస్తోంది. పెద్ద కరెన్సీ నోట్ల బ్యాన్ తో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఎవరూ కలలో కూడా ఊహించని నిర్ణయాన్ని మోదీ రాత్రికి రాత్రి ప్రకటించడంతో రాజకీయంగా కూడా కలవరం మొదలైంది. పార్లమెంట్ లో పూర్తి స్థాయి బలమున్న బిజెపికి అధికార భయం లేకున్నా కానీ మోదీకి మాత్రం అధికారం ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చ సాగుతోంది. అసలు మోదీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. మోదీకి పదవీ గండం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో కేవలం మోదీ కార్డు మీద మాత్రమే అధికారంలోకి వచ్చిన బిజెపిలో ఇప్పుడు అవకాశవాద రాజకీయాలకు చోటుదొరికే అవకాశం ఉంది.

బీజేపీ పార్టీ సీనియర్ నాయకులైన రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ లతో పాటు, అటు సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానితో కూడా ప్రధాని పీఠం కోసం పడి గాపులు కాస్తున్నట్టు టాక్. అంతే కాకుండా అద్వాని నాయకత్వంలో ఒక బ్యాచ్ కూడా ఉందట. దీంతో తాను ప్రధాని అయితే వారందరికీ పదవులు గ్యారెంటీ అని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా ఒకే పార్టీలో ఉంటూ ఇలా మోదీ పదవికి ఎసరు పెట్టడం చాలా మందికి మింగుడు పడటం లేదు.పైకి మోదీతో వీళ్ళంతా చాలా సన్నిహితంగా ఉంటున్నప్పటికీ, మనసులో మాత్రం ప్రధాని ఖుర్చీ వైపే వీరి చూపు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం పార్టీలోనే కాకుండా అటు పార్టీ బయట కూడా మోదీకి పెద్ద రిస్క్ ఉందని చెప్తున్నారు. ఇక ఈ లిస్టులోకి ప్రధానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఇతర పార్టీ నేతలు కూడా మోదీ సీటుకి ఎసరు పెట్టిన లిస్టులో ఉన్నట్టు డిల్లీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు అన్నీ మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సాకుతో ఆయన్ను ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నారట.కానీ మోదీ మాత్రం ప్రజలకు ఇంకా ఎలాంటి పనులు చెయ్యాలి, వారికి ఎలా దగ్గరవ్వాలి అనే దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
తెలుగుదేశంలో ఆగష్టు భయం
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments