రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?

Rajini-rebirth

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఆయనంటే ఎంత అభిమానిస్తారో ఒక్క ఇండియన్స్ కు మాత్రమే కాదు ప్రపంచంలోని ఎంతో మంది సినీ అభిమానులకు తెలుసు. అలాంటి రజినీకాంత్ కు సంబందించిన ఓ కొత్త అంశాన్ని తెలుగోడ లేవనెత్తింది. మొన్నామధ్యన ఏపిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే దానిపై సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రజినీకాంత్ లాగా ఇంట్లో కూర్చోవాలని సలహా ఇచ్చారు. ఇక్కడ నిజానికి పవన్ సభకు, రజినీకాంత్ కు ఎలాంటి సంబందంలేదు. సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ ను రజినీకాంత్ తో పోల్చడానికి కారణం బహుశా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు రజినీకాంత్ రాజకీయ రంగంలోకి రాకపోవడాన్ని దృష్టిలోపెట్టుకుని అని ఉంటారు. ఏదిఏమైనా నారాయణ మాత్రం రజినీని ఇందులోకి లాగారు.

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో సంవత్సరాల నుండి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.తన సినిమా డైలాగుల ద్వారా ఎప్పటికైనా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడు.. తమిళనాడును పరిపాలిస్తాడు అనే ఓ భ్రమ కల్పించారు. రజినీకాంత్ ప్రతిసారి పొలిటికల్ ఎంట్రీ ఖాయం అని అనుకోవడం.. ఆయన మాత్రం ఎటూ తేల్చకుండా వదిలెయ్యడం జరుగుతోంది. తమిళనాడులో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎంతో మందికి చెమటలు పట్టిస్తుంది. ఆయన గనక రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే మాత్రం అక్కడి పార్టీలకు చుక్కలు తప్పవు. కానీ రజినీకాంత్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వకుండా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం తీసుకుంటూ ఇప్పట్లో తనకు సినిమాపరంగా రిటైర్మెంట్ లేదని చెప్పకుండా సినీరంగంలో దూసుకెళుతున్నారు . తాజాగా వచ్చిన కబాలీ సినిమాయే సాక్ష్యం.

ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళనాడులో రజినీకాంత్ రాజకీయంగా ఎప్పుడు వస్తారు అన్నది తేలని ప్రశ్న. కానీ సినిమాల్లో మాత్రం రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి డైలాగులు మాత్రం భీభత్సంగా పేలుతుంటాయి. ఇలాంటి డైలాగులు తమిళనాడు రాజకీయాల్లోకి రజినీ ఎంట్రీని మరింత హైప్ క్రియేట్ చేసేలా చేస్తాయి. రజినీకాంత్ దాదాపుగా తాను సినిమాలు తప్ప రాజకీయ ప్రవేశం చెయ్యలేను అని చెప్పకుండానే పరోక్షంగా చెప్పారు. మరోపక్క తమిళనాడులో జయలలిత అంతకంతకు బలపడుతోంది. మరో నాయకుడి అవసరం లేకుండా చేస్తోంది. మరి రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అంటే మాత్రం అది ఈ జన్మకు కుదిరేలా కనిపించడంలేదు. రజినీకాంత్ మరో జన్మఎత్తి అది కూడా ఓ పొలిటికల్ లీడర్ లాగా పుడితే కానీ అది సాధ్యపడదు అనిపిస్తోంది.

ఇక ఈ మధ్యన రజినీకాంత్ దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్నేహితుడు పొన్ రాజ్ తో భేటీ కావడం రాజకీయంగా మరోసారి రజినీ పేరును స్క్రీన్ మీదకు తెచ్చింది. పొన్ రాజ్ అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ వ్యవస్థాపకుడు కావడం విశేషం. ఇప్పుడు రజినీకాంత్ ఆ పార్టీలో చేరతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రజినీకాంత్ చరిష్మా ప్రకారం అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకొని రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం రజినీకాంత్ కు లేదు. ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తే చాలు తమిళనాడు రాజకీయం మొత్తం మారిపోతుంది. బహుశా ఆ పార్టీకి మద్దతు తెలుపమని అడగడానికి వచ్చి ఉండవచ్చు.

ఏది ఏమైనా రజినీకాంత్ సినిమాల్లోని డైలాగులు ఇప్పుడు మరోసారి రాజకీయ కోణంలో కాకరేపుతున్నాయి. నా దారి రహదారి అనే డైలాగ్ కానివ్వండి.. నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అనే డైలాగ్.. రావాలసిన సమయానికి సరిగ్గా వస్తాను అనే డైలాగ్..దేవుడు శాసిస్తాడు అరుణాచలం(రజినీకాంత్) పాటిస్తాడు అనే డైలాగులు పొలిటికల్ టచ్ ఉన్నవే. ఇప్పటికే ఈ డైలాగులతో రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చారు. కానీ రీల్ మీద కాకుండా రియల్ లైఫ్ లో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అనేది తేలని ప్రశ్నే. ఈ డైలాగులను విశ్లేషిస్తే రజినీకాంత్ ను రాజకీయం గురించి ఈ జన్మకు అడగాల్సిన అవసరంలేదనిపిస్తోంది. ఎందుకంటే రజినీ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే కదా.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
టాప్ గేర్ లో ముద్రగడ
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
చెత్త టీంతో చంద్రబాబు
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
పిట్టల దొరను మించిన మాటల దొర
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
పవన్ క్షమాపణలు చెప్పాలి

Comments

comments