రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?

Will RamGopalVarma catch gangster Nayeem

తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా పేరుతెచ్చుకున్న నయీం మొత్తానికి చనిపోయాడు. పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ లో నయీం చనిపోయాడు. కాగా ఆయన చనిపోయిన తర్వాత ఒక్కో కోణం వెలుగులోకి వస్తోంది. పొలిటికల్ లీడర్లతో మంచి సంబందాలు కలిగిన నయీం ఎన్నో సెటిల్ మెంట్లు చేశారు. ఒకప్పుడు మావోయిస్టుగా పని చేసిన నయీం అక్రమ మార్గంలో ఎన్నోవేల కోట్లు పోగేశాడు. కొంత మంది పోలీసులతో కాంటాక్ట్ లో ఉన్న నయీం.. వారి అండదండలతోనే ఇంతింతై అన్నట్లు పెరిగి.. అన్ని మెట్రో నగరాల్లో తన గ్యాంగులను తయారు చేసుకున్నాడు.

ఓ మావోయిస్టుగా పోలీసులకు టార్గెట్ గా నిలిచి.. క్రిమినల్ గా పోలీసుల తూటాలకు బలయ్యాడు. కబ్జాలు, రౌడీయిజం చేస్తూ పొలిటికల్ లీడర్లకే సవాల్ విసిరాడు. ఇక కోట్లకు పడిగెత్తిన నయీం గడాఫీ స్టైల్లో అమ్మాయిలను తన బాడీ గార్డులుగా పెట్టుకున్నాడు. అన్ని రకాల అక్రమాలకు పాల్పడిన నయీం ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో కూడా కాలుపెట్టుకోవాలనుకున్నాడు. భువనగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో కాలుపెట్టాలని అనుకున్నాడట. నయీం చనిపోయిన తర్వాత ఆయన రాసిన డైరీలలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆయన డైరీలో దాదాపుగా 80 మంది జర్నలిస్టుల పేర్లు, కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయని.. ఓ బడా ఛానల్ బాస్ కూడా నయీంకు బాగా దగ్గరి అని తెలిసింది. క్రైం స్టోరీలను సంపాదించడానికి, ఓ పొలిటికల్ లీడర్ నుండి తనకు వచ్చిన బెదిరింపులను సెటిల్ చెయ్యడానికి  ఆ మీడియా ఛానల్ ఓనర్ నయీంతో బాగా క్లోజ్ గా ఉన్నారని తెలిసింది. ఇలా ఒకే క్రిమినల్ లో ఇన్ని కోణాలు ఏదో సినిమా స్టోరీగా ఉన్నా.. ఇది రియల్. ఇలాంటి రియల్ కథలనే తన సినిమాలుగా ఎంచుకోవడంలో రాంగోపాల్ వర్మ ముందుంటారు. గతంలో పరిటాల రవి నేపథ్యంలో సాగిన రక్తచరిత్ర, కర్ణాటక మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ నేపథ్యంలో కిల్లింగ్ వీరప్పన్, ఇప్పుడు తీస్తున్న వంగవీటి కూడా ఇలాంటి స్టోరీలే. మరి నయీంను కూడా రాంగోపాల్ వర్మ పట్టుకుంటారేమో చూడాలి.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఏపి సిఎంగా నారా లోకేష్
ఓటుకు నోటు కేసును మూసేశారా?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments