అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?

Will telangana govt buy cars from KCR family's favoured automotives

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణవ్యాప్తంగా ఎలాంటి అడ్డులేకుండాపోయింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ మెజార్టీతో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం చేపట్టారు. నాటి నుండి తెలంగాణలో ఆయనకు ఎదురులేకుండాపోయింది. తెలంగాణలో ఆయన్ని ఎదురించే ఒక్క నాయకుడు కూడా బలంగా లేకపోవడం బాగా కలిసి వచ్చింది. అయితే అవినీతి మరకలు అంటకుండా జాగ్రత్తపడినా కానీ పోలీస్ వ్యవస్థను అధునీకరించే టైంలో మాత్రం కేసీఆర్ ఫ్యామిలీకి లాభం చేసేలా ప్రభుత్వం ఫైళ్లను కదిలించింది అని వార్తలు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థను అధునీకరించడంలో భాగంగా పోలీసులకు కొత్త వాహనాలను అందించారు. కాగా పోలీసుల కోసం తీసుకున్న వాహనాలను కేవలం ఒక డీలర్ నుండి తీసుకుట్లు వార్తలు వచ్చాయి. కాగా డీలర్ కేసీఆర్ అల్లుడు, కవిత భర్త అని తేలింది. దాంతో ప్రతిపక్షాలు దీనిపై మండిపడ్డాయి. కానీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్య చెయ్యలేదు. కానీ ఇప్పుడు మరోసారి అదే తప్పును ఆయన రిపీట్ చేస్తారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త జిల్లాలుగా విభజించిన తర్వాత కొత్త అధికారులు, కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అధికారుల కోసం కొత్త వాహనాలను కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇక్కడే అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ గతంలో మాదిరిగా తన అల్లుడికే ఈ డీల్ ను కట్టబెడతారా..? లేదంటే మార్కెట్ లో తక్కువ రేట్ ఎవరు ఆఫర్ చేస్తే వారికి కట్టబెడతారా..? అనేది చూడాలి.

Related posts:
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
బాబుగారి చిరు ప్లాన్
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
చంద్రబాబు సమర్పించు ‘దావోస్ మాయ’

Comments

comments