బాబును పట్టుకోండి సాక్షాలివిగో

Witness for chandrababu Naidu corruption

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతాన్ని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. విభజన తర్వాత అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు పరోక్షంగా అవినీతికి ఆస్కారమిచ్చాడు అని జగన్ వాదన. ముందు నుండి ప్రతి ప్రాజెక్టు, ప్రతి పని విషయంలో అవినీతి జరుగుతోందని జగన్ బల్లగుద్దిచెబుతున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా కేంద్రానికి నివేదించామని వెంటనే అతడిని పట్టుకోవాలి అన్నట్లు జగన్ లేఖలో తెలిపారు.

గత రెండున్నరేళ్లలో చంద్రబాబు నాయుడు అవినీతికి అంతులేకుండాపోయిందని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా దోచుకున్నారు అన్న దానిపై తాము అందించిన బుక్ లో అన్ని వివరాలున్నాయని జగన్ మోదీకి తెలిపారు. చంద్రబాబు అవినీతి పాలనకు ఆ బుక్ లో ఆధారాలను కూడా అందించామని, కానీ దానిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కానీ ఎంక్వైరీ కానీ వెయ్యలేదని జగన్ వెల్లడించారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయిన మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్ గా ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనే ప్రయత్నం చేసినా కానీ ఇప్పటి వరకు అరెస్టు కానీ రిజైన్ కానీ చెయ్యలేదని జగన్ అన్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి బాగోతాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టిన జగన్.. వెంటనే చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
సల్మాన్ ఖాన్ నిర్దోషి
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబు బండారం బయటపడింది
అడవిలో కలకలం
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
జయ మరణం ముందే తెలుసా?
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments