మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె

SakshiMalik2

125 కోట్ల భారతీయుల ఎదురు చూపులకు ఓ వెలుగు కనిపించింది. రియో ఒలంపిక్స్ వేదికపై భారత మువ్వన్నెల జెండా రెపరెపలు ఇంకెప్పుడు అంటూ సాగిన నిరీక్షణకు సాక్షి మాలిక్ చరమగీతం పాడింది. గర్వంగా ప్రతి భారతీయుడు తలెత్తుకు తిరిగేలా 12 రోజుల తర్వాత మొదటి పతకాన్ని సాధించిపెట్టింది. రియో వేదికపై చెమటలు చిందించి.. భారతీయుల కళ్లలో ఆనందాన్ని చూసింది. మహిళల 58 కిలోల విభాగంగో కాంస్య పతకాన్ని మన మువ్వన్నెల పతాకాన్ని విజయగర్వంతో రెపరెపలాడించింది. చివరి క్షణం వరకు పోరాడిన సాక్షి మొత్తానికి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.

క్వార్టర్స్‌లో సాక్షి 1-3తో రష్యా రెజ్లర్‌ వలెరియా కొబ్లోవా చేతిలో ఓటమిపాలైంది. అయితే, తన ప్రత్యర్థి ఫైనల్‌కు చేరుకోవడంతో సాక్షికి రెపిచేజ్‌ ఆడే అవకాశం దక్కింది.కిర్గిస్థాన్ కు చెందిన ఐసులు టినీబెకోవాను ఓడించి కంచు మోగించింది సాక్షి మాలిక్. మొదటి బాట్ లో 0-4తో వెనకబడిన మాలిక్ తర్వాత పుంజుకుంది. మరో ఆరు సెకన్లలో బౌట్ ముగుస్తుంది అనగా 5-5తో సమం చేసింది. రెపిచేజ్ రెండో రౌండ్ లో సాక్షి మాలిక్ 12-3తో మంగోలియా రెజ్లర్ జర్కాన్ పురెవ్ దోర్జ్ ను చిత్తుగా ఓడించింది. తన కష్టానికి రియో వేదికగా పతకం లభించింది.

నాలుగో మహిళ:
ఒలంపిక్స్ లో భారతకు పతకాలను సాధించిపెట్టిన మహిళ అధ్లెట్ల జాబితాలో సాక్షి మాలిక్ నాలుగో వ్యక్తిగా రికార్డులకెక్కారు. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీలో, బాక్సర్ మేరీ కోమ్ 2012 లండన్ ఒలంపిక్స్ లో, షట్లర్ సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలంపిక్స్ లో పతకాలను సాధించారు. ఇప్పుడు సాక్షి మాలిక్ 58 కేజీల రెజ్లర్ గా కాంస్యాన్ని సాధించి.. ఒలంపిక్స్ లో పతకం సాధించిన నాలుగో మహిళగా నిలిచారు.

సాక్షి మాలిక్ ఏమన్నదంటే..
ఒలింపిక్స్‌లో పతకం సాధించి జాతీయ జెండా కప్పుకుని పరుగెత్తాలన్నది తన కల అని రెజ్లర్ సాక్షిమాలిక్ తెలిపింది. తన కల ఇప్పుడు నిజమైందని, ఇది తన జీవితంలో మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ పతకం కోసం 12 ఏళ్లుగా సాధన చేస్తున్నట్లు తెలిపింది. పతకం కోసం చివరివరకూ పోరాడాలని ముందే నిశ్చయించుకున్నట్లు పేర్కొంది. తనను ప్రోత్సహించిన దేశ ప్రజలందరికీ సాక్షి మాలిక్ కృతజ్ఞతలు తెలిపింది.

భారతీయుల 12 రోజుల కల.. సాక్షి మాలిక్ 12 ఏళ్ల కల
యావత్ భారతం రియోలో మన జెండా రెపరెపలు ఉంటాయా అని కళ్లారా ఎదురు చూసింది. కానీ భారతీయుల కలలను నిజం చేస్తూ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి భారత కీర్తిపతాకాలను ఎగరేసింది. అయితే భారతీయులు కేవలం 12 రోజుల నుండి ఎదురుచూస్తుంటే.. సాక్షి మాత్రం 12 సంవత్సరాలుగా ఒలంపిక్స్ లో మెడల్ సాధించాలని ఎదురుచూస్తోంది. ఎన్నో కష్టాలకు ఓర్చి.. చివరకు రియో వేదిక మీద తన సహచరులు నిరుత్సాహాన్ని తీర్చడమేకాకుండా నూతన ఉత్సాహాన్ని నింపింది.

రియోలో మాలిక్ విజయంపై పలువురి స్పందన:

 

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
వన్డేలో టీమిండియా విజయం
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments