రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం

Wrost Statements on Mayawati in Rajyasabha

బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూపీ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్‌పై వేటు వేసింది. ఇప్పటికే గుజరాత్‌లో దళితులపై దాడుల విషయంపై రగడ నెలకొనగా తాజాగా దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బిజెపిని మరింత ఇరకాటంలో పడేశాయి. దయాశంకర్ వ్యాఖ్యలపై రాజ్యసభ అట్టుడికింది. స్వయంగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అతడి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. అటు దయాశంకర్‌ను బిజెపి నుంచి తొలగిస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. యూపీ బిజెపి అధ్యక్షుడు మౌర్య ప్రకటన చేస్తూ దయాశంకర్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

అంబేద్కర్, కాన్షీరాం బాటలో తాను అట్టడుగు వర్గాల తరఫున గొంతు వినిపిస్తున్నానని, దేశం మొత్తం తనను బెహన్‌ జీ గా సంభోదిస్తారని మాయావతి గుర్తుచేశారు. అలాంటి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్న బీజేపీని దేశ ప్రజలు క్షమించరని మయావతి హెచ్చరించారు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి వెంట వెళ్తారని, వేశ్య కంటే హీనమని మాయావతిపై దయాశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
కాటేసిందని పాముకు శిక్ష
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఆరిపోయే దీపంలా టిడిపి?
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
ఆట ఆడలేమా..?
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
పోరాటం అహంకారం మీదే
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
దిగజారుతున్న చంద్రబాబు పాలన
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments