వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)

YCP MLAs comments on Nara Lokesh and Chandrababu Naidu

నారాలోకేష్ అంటే తెలియని వారుండరు రెండు తెలుగు రాష్ట్రాల్లో.. అలాగే ప్రపంచవ్యాప్తంగానూ ఎక్కడైతే తెలుగువారు స్థిరపడ్డారో. ఎంతో అనుభవం ఉందని తలిచే చంద్రబాబు తనయుడు లోకేష్‌ని మాత్రం ప్రతిపక్ష నాయకులు అలాగే జగన్ అభిమానులు ఒక ఆట ఆడుకుంటారు ఏ పనిచేసినా. మంత్రి కాకపోయినప్పటికీ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లలో కూర్చోవడం ఎన్నో విమర్శలకు తావిచ్చింది. ఈ రకంగా నారాలోకేష్ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ ప్రాజెక్టులోనూ వేలు పెడతారనే విమర్శ కూడా ఉంది. అంతేకాకుండా.. ఆస్తుల ప్రకటనలో తండ్రికిమించిన తనయుడిగా పేరుగాంచాడు.

ఇటీవల చంద్రబాబు పెట్టిన 10 వేల కోట్ల నల్లధనం చిచ్చును వైకాపా నేతలు, జగన్ అభిమానులు తిప్పికొట్టిన తరువాత తాజాగా వారి దృష్టి లోకేష్ అక్రమాలపై పడిందని చెప్పుకోవాలి. ఏకంగా లోకేష్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని వేలకోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నాడని ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్‌లు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అవినీతిని రాష్ట్రప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు అవినీతి తారాస్థాయికి చేరిందని విరుచుకుపడ్డారు. పక్కా గృహాలు నిరుపేదలకు మంజూరు చేయడంలో విఫలం అవ్వడమే కాకుండా అవి తెలుగుదేశం పార్టీ వారికే ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు తీవ్ర అవినీతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హామీలను పక్కనపెట్టి అక్రమాలకు పాల్పడుతున్న తండ్రీకొడుకులను ప్రజలు గమనిస్తున్నారని, రానున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజ్యమేనని వారు స్పష్టం చేశారు.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
అంత దైర్యం ఎక్కడిది..?
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
హైదరాబాద్ లో ఆ బిల్డింగ్ కూలడానికి ఊహించని కారణం ఇదే!
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

Comments

comments