దేశంలో నోట్ల రద్దు… బాబుగారి ఐడియానే!

Yellow Media presenting Chandrababu naidu as Master Mind behind Currency ban

దేశంలో ఎక్కడ ఏం జరిగినా దానికి ఒక్కరితో మాత్రం లింక్ ఉంటుంది. దేశంలో సెల్ ఫోన్లు వచ్చినా, దేశంలో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నా, దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కినా అందతా ఒక్క వ్యక్తికి పేటెంట్ హక్కులు ఉంటాయి. ఆ వ్యక్తి ఎవరోమీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకుండా అంత అర్హత ఉన్న వ్యక్తి ఎవరుంటారు లెండి. అవును తాజాగా మరో ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేపుతోంది. ఇంతకీ బాబుగారు ఏం మాట్లాడారు అని అనుకుంటున్నారా..? అయితే మొత్తం చదవండి.

నరేంద్ర మోదీ దేశానికి షాకిచ్చారు. ఉన్నపళంగా ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేశారు. అయితే దేశం మొత్తం దీని మీదే చర్చ సాగుతోంది. అయితే ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు మాట నెగ్గిందంటూ బాబు భజన చేసే మీడియా గ్రూప్ ప్ర‌చారం మొదలుపెట్టింది. బాబుగారి సూచన మేరకు మోదీ నోట్ల మీద నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి బాబు ఆశించిన‌ట్టుగా మోడీ ప్ర‌భుత్వం 500 నోట్లు రద్దు చేయ‌లేదు. పైగా వెయ్యి నోట్ల స్థానంలో రెండువేల నోట్ల ప్ర‌వేశ‌పెట్ట‌డం బాబు అంచ‌నాల‌కు భిన్నంగా ఉంది. ఆయ‌న ఆశించిన‌దానికి విరుద్ధంగా ఉంది.

అయితే మీడియా మాత్రం బాబు మాట గెలిచింద‌నే ప్ర‌చారం మాత్రం సాగిపోతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగా 500 నోట్లు రద్దు చేశార‌నే ప్ర‌చారం సాగిస్తున్నారు. కానీ వాస్త‌వానికి 500 నోట్ల మార్పిడి మాత్ర‌మే జ‌రిగింది. కొత్త నోట్లు చెలామ‌ణీలోకి రాబోతున్నాయి. దానికితోడుగా వెయ్యి నోట్ల‌కు డ‌బుల్ చేస్తూ రెండు వేల నోట్ల ముందుకు రాబోతోంది. త‌ద్వారా బాబు చెప్పిన‌ట్టు పెద్ద నోట్ల ర‌ద్దు కావ‌డం లేదు. స‌రిక‌దా మ‌రింత పెద్ద నోట్లు ముందుకొస్తున్నాయి. అంటే బాబు చెప్పిన మాట‌కు, వాస్త‌వ ఆచ‌ర‌ణ‌కు పొంత‌న‌లేదు.

అయినా ఈ విష‌యాన్ని మ‌రుగునప‌ర‌చ‌డానికి సాగుతున్న ప్ర‌య‌త్నం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్ర‌బాబు ఏదో సాధించారంటూ చెప్ప‌డం వింత‌ల్లో వింత‌గా అనేక‌మంది భావిస్తున్నారు. మొత్తంగా ఈ నోట్ల మార్పిడి, కొత్త నోట్ల ప్ర‌వేశం అనే ప్ర‌క్రియ ద్వారా దేశానికి, సాధార‌ణ ప్ర‌జానీకానికి ప్ర‌యోజనాల మాట ప‌క్క‌న పెట్టేసి ఓవ‌ర్గం మీడియాలో మోడీని మొన‌గాడంటూ చిత్రీక‌రిస్తుంటే మ‌రో పక్కన ఎల్లో మీడియా మొత్తం క్రెడిట్ చంద్ర‌బాబుదే అని చెప్ప‌డం నిజంగా ఓ పెద్ద క్రెడిటే. అయినా అసలు మోదీని అలా ప్రకటన చెయ్యమని, స్క్రిప్ట్ రాసిచ్చింది కూడా చంద్రబాబు నాయుడే అని ఆ మీడియా ప్రచారం్ చేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
అంతే బాబూ.. టైం అలాంటిది మరి!
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments