యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!

Yogeshwar-Dutt

రియో ఒలింపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్కు కాస్త ఊరట లభించనుంది. లండన్ ఒలింపిక్స్లో 60 కేజీ ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగిన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని పట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒలింపిక్స్ లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ పై తాజాగా జరిపిన డోప్ టెస్టుల్లో అతడి శాంపిల్స్ పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకూ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రటకన వెలువడలేదు. 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ గత ఒలింపిక్స్ వరకూ లేని కారణంగా దాదాపు అన్ని దేశాల అథ్లెట్ల శాంపిల్స్ పై తాజాగా టెస్టులు నిర్వహిస్తున్నారు.

ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ జరిపిన టెస్టుల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన తమ అథ్లెట్ కుదుఖోవ్ డోపింగ్ టెస్టుల్లో విఫలమవడంతో రష్యా అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుదుఖోవ్ తో పాటు ఉజ్బెకిస్తాన్ కు చెందిన రెజ్లర్ తేమజోవ్(120కేజీ) కూడా పాజిటివ్ అని తేలింది. తేమజోవ్ బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించాడు. వాడా టెస్టుల ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్ లో కాంస్యంతో మెరిసిన యోగేశ్వర్ రజత పతక విజేతగా మారనున్నారని తెలుస్తోంది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
అరుపే గెలుపు
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments