యాహూ… మీ ఇంటికే డబ్బులు

you can get money at your home throug snapdeal

అసలే కరెన్సీకి కటకటలాడే కాలం.. అందునా ఏటీఎం ముందు గంటల కొద్ది లైన్లో నిల్చున్నా డబ్బులు దొరకేపరిస్థితి లేదు. అలాంటి టైంలో మీరేం ఏటీఎం ముందు లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు.. కేవలం మీరు కోరుకుంటే డబ్బులు మీ ఇంటికే వస్తే ఎలా ఉంటుంది. అవును..మీరు అనుకుంటున్నది అచ్చంగా నిజంగా జరిపేందుకు స్నాప్ డీల్ సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఏటీఎంల ముందు లైన్లో గంటకొద్ది నిల్చోవడం, అక్కడ నిల్చున్నా డబ్బులు వస్తాయా? అనే నమ్మకం లేకపోవడం లాంటి అన్ని సమస్యలకు స్నాప్ డీల్ బంపర్ సొల్యూషన్ కనుక్కుంది.

డ‌బ్బు అవ‌స‌ర‌మైన వారు క్యాష్ ఎట్ హోమ్  (Cash@Home) ద్వారా ఆర్డ‌ర్ చేస్తే కొరియ‌ర్‌ బాయ్ మీ అడ్ర‌స్‌కు స్వైప్ మెషీన్‌తో చేరుకుంటాడు. ఆపై మీ ద‌గ్గ‌రున్న డెబిట్ కార్డును స్వైప్ చేసి కొరియ‌ర్ బాయ్ నుంచి డ‌బ్బును తీసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం రెండు వేలు మాత్రమే ఇవ్వ‌నున్న‌ట్లు స్నాప్‌డీల్ తెలిపింది. ఆర్డ‌ర్‌పై ఒక్క రూపాయి క‌న్వీనియ‌న్స్ ఛార్జీని వ‌సూలు చేస్తున్న‌ట్లు స్నాప్‌డీల్ పేర్కొంది.  అన్నీ ఏటీఎం కార్డుల‌తో డ‌బ్బును పొందొచ్చ‌ని స్నాప్‌డీల్ వెల్ల‌డించింది. అయితే ప్రస్తుతానికి కేవలం గూర్గావ్, బెంగళూరులో మాత్రమే ఈ సర్వీసులను స్నాప్ డీల్ అందిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే అన్ని నగరాలకు దీన్ని విస్తరించనున్నట్లు  స్నాప్ డీల్ అధికారులు వెల్లడించారు. ఈ వార్త ఇప్పుడు ఎంతో మందికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఏటీఎం బాధలు కనీసం ఇలా అయినా తీరుతాయని వారు నమ్మకంగా ఉన్నారు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
పెట్రోల్ లీటర్‌కు 250
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఆటలా..? యుద్ధమా..?
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
ముద్రగడ సవాల్
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
అమ్మను పంపించేశారా?
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
డబ్బు మొత్తం నల్లధనం కాదు
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments