రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం

young Tiger NTR support to two telugu state govt with his Janatha Garrage Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన పేరు. తారక్ తాజాగా తీసిన సినిమా జనతాగ్యారేజ్. ఆ సినిమా ట్రైలర్ విడుదలై ఎంతో మంచి పేరుతెచ్చుకుంది. అయితే ట్రైలర్ చూసిన వాళ్లంతా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి ఎన్టీఆర్ కూడా బలం చేకూరుస్తున్నాడని అనుకుంటున్నారు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కార్యక్రమానికి తారక్ పరోక్షంగా తన సినిమా ద్వారా సహాయం చేస్తున్నాడు.

అసలు ఎన్టీఆర్ తో ఏంటి…? తెలుగు రాష్ట్రాలకు ఆయన ఎలా సహాయం చేస్తున్నాడు..? అనుకుంటున్నారా అయితే మొత్తం చదవండి. జనతాగ్యారేజ్ ట్రైలర్ లో ఎన్టీఆర్ ఓ ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తున్నాడు. అందులో చెట్లన్నా, గాలి, నీరు అన్నా ఎంతో ప్రేమ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఓ పార్క్ ను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఎన్టీఆర్ తన మాటలతో అడ్డుకుంటాడు. మూడు వందల చెట్లు.. వేల మందికి ఆక్సిజన్ అందిస్తున్నాయి అని డైలాగ్ కొడతాడు. బైక్ పై చెట్లను ఎక్కడికో తీసుకెళ్లే వాడిగా కనిపిస్తాడు. మొత్తంగా చెట్లను పెంచండి.. ప్రేమించండి అనే ధీమ్ ఎన్టీఆర్ సైడ్ నుండి కనిపిస్తోంది.

ఇప్పుడు జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ ఈ యాంగిలే.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి సహాయపడుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్ల మొక్కలను నాటేందుకు పూనుకుంది. ఇక ఏపిలో కూడా నీరు మీరు అనే కార్యక్రమం ద్వారా మొక్కలను నాటిలని ప్రయత్నం మొదలైంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి తాను తన సినిమా ద్వారా తోడుగా నిలుస్తున్నాడు. ఇలా ప్రభుత్వం చేస్తున్న మంచి పనిలో పరోక్షంగా ఎన్టీఆర్ కూడా సహకరిస్తున్నాడు కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ రిలాక్సేషన్ కల్పించాలని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
అడకత్తెరలో కేసీఆర్
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మద్యల నీ గోలేంది..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ఇక యుద్ధమే కానీ..
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
మోదీ భజన అందుకేనా?
జయలలిత జీవిత విశేషాలు
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments