ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!

YS Jagan belongs to which city

కాదేదీ కవితకనర్హం అని నానుడి. నిజమే కవితాత్మక మనసు ఉండాలే కానీ అన్నీ రసమయమే. అలాగే రాజకీయాల్లో కూడా అంతే. రాజకీయాలకు కాదేదీ అతీతం. ఎదుటి వ్యక్తిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు రాజకీయ నాయకుడు. అందులో భాగంగా తాజాగా ఏపిలో ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ గురించి లేని వివాదాన్ని, రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయో కళ్లకు కట్టిచూపించారు రాజకీయ ప్రబుద్ధులు.

ఇప్పుడు తాజాగా రాజకీయ సర్కిల్స్ లో చర్చకు దారి తీసిన ప్రశ్న ఒకటి ఉంది. అదే జగన్ ది ఏ ఊరు. ఇదేం ప్రశ్నండి పిచ్చి ప్రశ్న అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ విమర్శలకు ఇది కూడా ఒక ఆయుధంగా మారింది. మరి విమర్శించే వారికి ఆ మాత్రం తెలివి లేదా.. జగన్ ది కడప జిల్లా పులివెందుల అని…అలా. అయితే చంద్రబాబును కలవడానికి అందరు కుప్పంకు పోకుండా విజయవాడకు ఎందుకు వెళ్తున్నట్లు.. ఇది కూడా అలాంటిదే.. రాష్ట్ర నాయకులకు రాజధానే వారి ఊరుగా మారిపోతుంది. అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేవారికి మరీను. ఈ లెక్క ప్రకారం అయితే జగన్ కూడా తన మకాం విజయవాడకు మార్చాలి. కానీ మార్చలేదు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశమైంది.

పక్కరాష్ట్రంలో ఉండే జగన్ కు ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ది ఎలా తెలుస్తుంది అంటూ అప్పుడే ఒక నాయకుడు నోరు పారేసుకోవడం కూడా జరిగిపోయింది. కానీ జగన్ ఇప్పట్లో హైదరాబాద్ వదిలి రావడానికి సిద్దంగా ఉన్నట్లు లేడు. హైదరాబాద్ పై పదేళ్లు తమకున్న అధికారాన్ని ఎందుకు వదులుకోవాలన్న వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి చంద్రబాబును నీవెందుకయ్యా అప్పుడే విజయవాడకు వెళ్లావు అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి అన్నది టీడీపీ వర్గాల వాదన.

కానీ ఇక్కడ అసలు మేటర్ వేరే ఉంది. ఇద్దరి విషయంలో అసలు విషయం అది కాదంట… చంద్రబాబు హైదరాబాద్ వదిలి రావడానికి , జగన్ ఇంకా అక్కడే ఉండడానికి వారి పై ఉన్న కేసులే ముఖ్య కారణమట. తనను ఓటుకు నోటు కేసులో ఎక్కడ ఇరికిస్తారో అని చంద్రబాబు హైదరాబాద్ పై హక్కు ను వదిలేశారని టాక్. అయితే జగన్ మాత్రం తన మకాంను మార్చలేదని పిచ్చిప్రేలాపన చేస్తున్నారు రాజకీయ నిరుద్యోగులు. అయినా జగన్ ప్రజల్లోనే ఉన్నాడు.. ప్రజలతోనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు జగన్ ది ఏ ఊరు అనే ప్రశ్ననే పిచ్చిప్రశ్న. అయినా పచ్చకామెర్లు వచ్చిన వాడికి ప్రతీది పచ్చగానే కనిపించిన చందంగా తెలుగు తమ్ముళ్లకు అంతా పచ్చగానే కనిపిస్తున్నట్లుంది. తెలుగు తమ్ముళ్ల పైత్యానికి జగన్ త్వరలోనే మాత్ర వేస్తారని కూడా ప్రచారం సాగుతోంది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
ఓడినా విజేతనే.. భారత సింధూరం
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
అమ్మకు ఏమైంది?
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మావో నాయకుడు ఆర్కే క్షేమం
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
యుపీలో ఘోర రైలు ప్రమాదం
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

Comments

comments