హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది

jagan-fight-on-hoda

ప్రజాప్రయోజనాల ముసుగులో రాజకీయం జరగడం అనేది పరిపాటి. అయితే.. మొదట్లో ప్రజాప్రయోజనాలనే మీడియా చూపిస్తూ ఉండేది. కానీ.. ఇప్పుడు పార్టీ నేతలు నేరుగా అవతలి పార్టీ రాజకీయ కోణాల్ని ప్రజలకు చెప్పేస్తున్నారు. ఈ విధంగా ఇరు పార్టీవాళ్ళు వారి రాజకీయ కోణాల్ని బయటపెట్టుకుంటున్నారు. దీంతో.. టీవీల్లో డైలీ సీరియల్స్‌లాగా ప్రజల్లో ఓ ఉత్సుకత సృష్టించబడుతోంది రాజకీయాల్లో కూడా..! ఏ పార్టీ ఎత్తులు ఎలా ఉన్నాయి, తమకు ఇష్టమైన పార్టీవారు ఎత్తుకు పైఎత్తులు ఎలా వేస్తున్నారు? అని గుడ్లగూబల్లాగా కళ్ళప్పజెప్పి చూస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ.. ఏ పార్టీ అయినా ప్రజాప్రయోజనాలకే కట్టుబడవలసి ఉంటుంది. ఆ ముసుగులో రాజకీయం చేసి పైచేయి సంపాదించుకోవాల్సిందే.

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ‘ప్రత్యేక హోదా’పై తన మూడెంచెల ప్లాన్ ప్రకటించడం వల్ల దానిపై ఎప్పటినుండో వైకాపా చేస్తున్న పోరాటాన్ని ఒక్కసారిగా పవన్ హైజాగ్ చేశాడని ‘తెలుగోడ’ విశ్లేషించింది. ఎందుకంటే.. అప్పటివరకు ప్రత్యేక హోదాపై ఇటువంటి కార్యచరణ జగన్ గానీ, మరే ఇతర పార్టీ గానీ ఇవ్వలేదు. దీంతో.. పవన్ ప్రజల్ని ఒక్కసారిగా తనవైపు ఆలోచించేలా చేయగలిగాడు. కానీ.. ఇప్పుడు కేంద్రం ‘ప్రత్యేక హోదా’ లేదని తెలియజేయడంతో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తోటి ప్రతిపక్షాలైన సీపీఐ, సీపీఎంలతో కలిసి సెప్టెంబర్ 10న ఏపీ బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హైజాగ్ అయిన ప్రత్యేక హోదా పోరాటాన్ని మళ్ళీ తన పట్టాలపైకి జగన్ తెచ్చుకోగలిగారు.

Read Also : పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ మీటింగులకే పరిమితమై తన కార్యాచరణను ప్రకటిస్తే, జగన్ పదడుగులు ముందుకు వేసి  రాష్ట్ర బంద్ ద్వారా ప్రజల్లో తన పోరాటాన్ని తీసుకువెళ్ళడం జరుగుతోంది. అంతేకాకుండా అసెంబ్లీలో ప్రత్యేక హోదా పై నిరసనలకు, చర్చలకు అవకాశాలున్నాయి.

జగన్ తన రాజకీయ అనుభవాన్ని మూడు పార్టీలను (టీడీపీ, బీజేపీ, జనసేన) ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్ని రకాలుగా వైసీపీకి చెక్ పెడుతున్నా.. తిరిగి వారికే చెక్ పెట్టగలుగుతున్నారు. చివరికి ఎవరు గెలిచినా.. ప్రజలు, న్యాయమే గెలుపొందుతాయి.

Related posts:
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
జీఎస్టీ బిల్ కథ..
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
ఇదే జగ‘నిజం’
సింధూరంలో రాజకీయం
సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
బాబు Khan
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments