పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ

YS Jagan letter on Ten Thousand black money

తాటిని తన్నే వాడొకడుంటే.. వాడి తలదన్నే వాడు మరొకడు ఉన్నట్లు ఏపిలో రాజకీయ నాయకులు తయారయ్యారు. జగన్ ను ఇరుకున పెట్టాలనుకున్న చంద్రబాబుకు  మోదీకి రాసిన లేఖతో చెక్ చెప్పారు వైయస్ జగన్. వైయస్ జగన్ పది వేల కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖకు నల్లధనం కింద ఇచ్చినట్లు ఆధారాలులేని వార్తలు వచ్చాయి. తెలుగుదేశం తమ్ముళ్లు ఈ వార్తను ఆధారంగా చేసుకొని ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు నాయుడు, బోండా ఉమా ఇద్దరూ కూడా ఆ వ్యక్తి ఎవరో కాదు వైయస్ జగన్ అని అన్నారు. అయితే దీనిపై స్పందించిన జగన్ చంద్రబాబు అండ్ కో తో పాటుగా మోదీ ఈ విషయంలో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది అంటూ జగన్ లేఖ రాశారు.  జగన్ అధికారికంగా రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read:  10 వేలకోట్ల రచ్చ – తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన

తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రానికి ఆదాయ వెల్లడి పథకం(Income declaration Sceme-2016) కింద 13 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కథనంలో జగన్ పేరు తెలుగుదేశం నాయకులు తెర మీదకు తీసుకురావడంతో దానికి కారణం చంద్రబాబే అని జగన్ తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  ఆదాయ వెల్లడి పథకంలోని వివరాలు బయటపెట్టబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతోంది. కానీ ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 10 వేల కోట్ల నల్లధనాన్ని వెల్లడించారని చెబుతున్నారు. చంద్రబాబుకు ఆ సమాచారం ఎలా దొరికింది..? ఒకవేళ అది వాస్తవమైతే.. ఆ వ్యక్తి చంద్రబాబు బినామీ అయి ఉండవచ్చు… లేకపోతే అంత కచ్చితంగా పది వేల కోట్లు అని ఎలా చెబుతారు..? ఆంధ్రప్రదేశ్ ప్రజలగా తాము కూడా దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం.. దయచేసి ఆదాయం ప్రకటించిన వారి పేర్లు బయట పెట్టాలని లేఖలో జగన్ కోరారు.

గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులను జగన్ తన లేఖతో చిత్తు చేశారు. పది వేల కోట్ల నల్లధనాన్ని వెల్లడించింది జగన్ అని తెలుగుతమ్ముళ్ల మాటలకు జగన్ తన లేఖతో చెక్ చెప్పాడు. అసలు ఆ పది వేల కోట్లు ఎవరికి చెందినవి అన్న విషయం మీద చంద్రబాబుకు ఎలా తెలిసింది అన్న దానిపై జగన్ సంధించిన ఈ ప్రశ్న.. తెలుగు తమ్ముళ్లలోనూ చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అండ్ కో జగన్ ను అడ్డుకునే ప్రయత్నాన్ని జగన్ తిప్పికొట్టారు. ఎవరు తీసిన గోతిలో వారేపడటం అంటే ఇదే అంటూ వైయస్ జగన్ అభిమానులు, వైసీపీ నాయకులు. మొత్తానికి జగన్ దెబ్బకు చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లు ఠారెత్తిపోయారు.

జగన్ మోదీకి రాసిన లేఖ..

jagan Letter01

jagan Letter02

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
సైన్యం చేతికి టర్కీ
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
ఆట ఆడలేమా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
ఏపీకి ఆ అర్హత లేదా?
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
తిరిగిరాని లోకాలకు జయ
వాళ్లకు ఇదే చివరి అవకాశం
అందుకే భూకంపం రాలేదట
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి

Comments

comments