ఒక్క అడుగు.. అదే బాటలో జననేత

YS Jagan may start padayatra soon

కొంత మంది చేసే పనులు, కొన్ని పనులు చరిత్రలో నిలిచిపోతాయి. అలాంటి చరిత్రలో నిలిచిపోయే పనికి సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత వైయస్ జగన్. ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు ప్రభుత్వం మీద అసహనాన్ని, ప్రజల్లోని అసమ్మత్తిని వెలికితియ్యడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి జగన్ వేస్తున్న అడుగు ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. జగన్ గతంలో నిర్వహించిన అన్ని యాత్రలకన్నా కూడా ఈ ఒక్క యాత్ర మాత్రం పొలిటికల్ గా జగన్ కు మంచి మైలేజ్ ఇవ్వడంతోపాటుగా, చంద్రబాబుకు ముప్పుగా మారనుంది. ఇంతకీ జగన్ చరిత్రలో నిలిచిపోయేంత పని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా..? అయితే మొత్తం ఆర్టికల్ చదవండి.

జననాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో తన తండ్రిలాగా తాను కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి, వారికి చేరువ కావాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి చేసిన నిర్వాకాలకు వైయస్ఆర్ తన పాదయాత్ర ద్వారా చరమగీతం పాడారు. ఇప్పుడు వైయస్ జగన్ అందుకు పూనుకుంటున్నారు. అసలే ఉడుకు రక్తం, అందునా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ఆగ్రహంగా ఉన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విభజన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటినుండి రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరుగుతోంది. కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన, ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదు. పైగా ప్రత్యేక సాయం పేరుతో కేంద్రం ఆంధ్రులను మోసం చేసింది. దీనిపై, ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను ప్రజలకు ఈ పాదయాత్రలో జగన్ వివరించేఅవకాశాలున్నాయి.

కాల్ మనీ, ఓటుకు నోటు కేసు, పట్టిసీమ అవినీతి, రిషితేశ్వరి ఆత్మహత్య, అమరావతి భూముల్లో అవినీతి, స్విస్ ఛాలెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అన్యాయాలు చాంతాడంత ఉన్నాయి. బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటికే గురుతర బాధ్యతను నిర్వహిస్తుండగా, తాజాగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు పాదయాత్ర అనే వజ్రాయుధాన్ని తీస్తున్నారు. పీడిత వర్గాల బాధలను, రైతుల కన్నీటి కథలను, మహిళల ఆగ్రహాన్ని, విద్యార్థుల అభ్యర్థనలను జగన్ తన పాదయాత్రలో తెలుసుకుంటూ సాగుతారు. ఇలా వచ్చే ఎన్నికల్లోపే చంద్రబాబు నాయుడు సర్కార్ ను ప్యాకప్ చెసేందుకు జగన్ ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
అడకత్తెరలో కేసీఆర్
టాప్ గేర్ లో ముద్రగడ
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
పట్టిసీమ వరమా..? వృధానా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
మెరుపు దాడి... నిజమా-కాదా?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
మేడిపండులాంటి కేసీఆర్ సర్కార్
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

Comments

comments