దివీస్ పై జగన్ కన్నెర్ర

YS jagan Mohan Reddy fire on Devis pharma company

ఏపిలోని తూర్పు గోదావరి జిల్లా దివీస్ మందుల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వైయస్ జగన్ గళమెత్తారు. దివీస్ యాజమాన్యం తక్షణం నిర్మాణ పనులు మానుకుని వేరేచోటకు తరలిపోవాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన నిలబడి, పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.  ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, ప్రాంత ప్రజలకు అండగా ఉండి పోరాడేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటైతే ఈ ప్రాంతమంతా కాలుష్య భరితంగా మారిపోతుందన్నారు. పరిశ్రమ ఏర్పాటైతే 65 లక్షల లీటర్ల నీటిని పరిశ్రమకు ఉపయోగిస్తూ, అందులో 55 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను తిరిగి సముద్రంలోకి విడిచిపెడతారని హెచ్చరించారు.

దివీస్ ఫ్యాక్టరీ ఉండే ప్రాంతంలోని మత్స్యకారులంతా వీధిన పడే ప్రమాదం ఉందని వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చాలా కాలంగా హేచరీలను అభివృద్ధి చేశారని, వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా 400 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోందన్నారు. అలాంటి హేచరీలకు కూడా మెడికల్ కంపెనీ ఏర్పాటుతో తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరానికి 5 లక్షలు చెల్లించి సుమారు 670 ఎకరాలను దివీస్ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నిందని విమర్శించారు. చిన్న సన్నకారు రైతుల నుండి ఎకరం, రెండెకరాల భూములను బలవంతంగా లాక్కుని దివీస్ కంపెనీకి కట్టబెట్టడం ఎంత వరకు సమంసమని ప్రశ్నించారు. గత 82 రోజులుగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, పోలీసు బలగాలను రంగంలోకి దించారని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు.

బాధితుల పక్షాన పోరాడుతున్న తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై 22 అక్రమ కేసులను పోలీసులు నమోదు చేశారని, అందులో 7 హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. మహిళలని చూడకుండా బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్‌లు చేస్తున్నారని, 82 రోజులుగా ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ను ఎందుకు విధించాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. బహిరంగ సభ వేదికపై ఈ ప్రాంతానికి చెందిన సుమారు పది మంది బాధితులతో దివీస్ ఫ్యాక్టరీ కారణంగా ఎదురైన సమస్యలపై మాట్లాడించారు. చివరగా దివీస్ మందుల కంపెనీని ప్రజా నిరసనల మధ్య బలవంతంగా నిర్మించిన పక్షంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని తొలగిస్తానని జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
బాబు గారి అతి తెలివి
జగన్ సభలో బాబు సినిమా
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
నారా వారి నరకాసుర పాలన
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
అకౌంట్లలోకి 21వేల కోట్లు
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
గాలిలో విమానం.. అందులో సిఎం
అమ్మను పంపించేశారా?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments