బాబుకు గడ్డి పెడదాం

YS Jagan mohan reddy gear up for Arogya Sree

వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈసారి పేదవాడికి ఆరోగ్య భరోసానిచ్చిన ఆరోగ్య శ్రీ పధకం మీద ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆయన యుద్ధాన్ని మొదలుపెట్టారు. ప్రతి పేదవాడికి ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే.. ఈ ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోందని వైయస్ జగన్ ఆరోపించారు.  పేదవాడు రెండు కార‌ణాల వ‌ల్ల అప్పుల పాలు అవుతాడ‌ని అవి అనారోగ్యం, పిల్లల చదువేన‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యాన్ని దివంగ‌త వైఎస్ఆర్ ఎప్పుడూ చెబుతూనే ఉండేవార‌ని ఆయ‌న అన్నారు. నిజమే పేదవాడికి ఈ రెండే అతిపెద్ద అవసరాలుగా మారతాయి. అయితే ఇలాంటి ఆరోగ్య శ్రీని చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్వీర్యం చేస్తోందని గతకొంత కాలం నుండి జరుగుతున్న పరిణామాలను చూస్తేనే కనిపిస్తుంది.

పేదలకు అన్ని రకాల వైద్య సహాయం చేసే అద్భుతమైన పథకం ఆరోగ్య శ్రీ అని వైయస్ జగన్ వెల్లడించారు.ఇప్పుడు దాన్ని కూడా ప‌ట్టించుకున్న పాపాన రాష్ట్ర ప్ర‌భుత్వం లేద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న పాల‌న‌లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో పది అంబులెన్సులు ఉండేవ‌ని, వాటిలో ఏడు పడుకున్నాయని, మూడు మాత్ర‌మే పనిచేస్తున్నాయని విమ‌ర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించగానే ఆరోగ్యమిత్రలను పూర్తిగా ఉద్యోగాల నుంచి తీసేశారని ఇక పేద‌ల‌కు మంచి వైద్యం ఎలా అందుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉన్న అన్ని రకాల వెసలుబాటులను చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తీసివేస్తున్నారని అన్నారు.

ఆరోగ్యం బాగాలేని ఓ పేదవాడు ఆస్పత్రి బిల్లులు చెల్లించలేని ఆర్థిక అసమర్థత ఉందని.. కనీసం పొలాలు అమ్మైనా ఆస్పత్రి బిల్లు చెల్లిద్దామన్నా కానీ భూముల రిజిస్ట్రేషన్ నిలిపి వేసి, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందని జగన్ ఆరోపించారు. నిజానికి ఈ సంవత్సరం ఆరోగ్యశ్రీ ప‌థ‌కం కొన‌సాగించ‌డానికి 910 కోట్ల రూపాయలు ఈ ఏడాదికి ఖర్చవుతుందని ఆరోగ్య శాఖ స‌ర్కారుకి చెబితే, ప్ర‌భుత్వం మాత్రం కేవలం 565 కోట్ల రూపాయలే కేటాయించిందని ఆయ‌న అన్నారు. పేద‌ల త‌రఫున పోరాడుతూ చంద్రబాబుకు బుద్ధి వచ్చేవరకు ఆయనకు గడ్డి పెడుతూనే ఉంటామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మొత్తానికి వైయస్ జగన్,  చంద్రబాబు నాయుడు ఆరోగ్య శ్రీ మీద చూపిస్తున్న సవతి ప్రేమను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
మా టీవీ లైసెన్స్ లు రద్దు
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
పోరాటం అహంకారం మీదే
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బిచ్చగాళ్లు కావలెను
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
BSNL లాభం ఎంతో తెలుసా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
ఛాయ్‌వాలా@400కోట్లు
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments