విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి

YS Jagan Mohan Reddy slam chandrababu Naidu for Guntur aerial survey

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మరోసారి విచురుకుపడ్డారు. కుండపోతగా కురిసిన వర్షాలకు రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే  చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని జగన్ మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా పండే పత్తి, మిరప రైతులు పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారని, కనీసం పెట్టుబడి కూడా రాని దయనీయ పరిస్థితి నెలకొందని జగన్ వివరించారు. కాగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పంట నష్టాన్ని పరిశీలించడానికి విమానాల్లో తిరుగుతున్నారని జగన్ దుయ్యబట్టారు.

వర్షాల కారణంగా దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో ప్రత్తి, వరి చేలతో పాటు ఒకటిన్నర లక్షలకు పైగా మిరప పంటలకు నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. ఇంత విసత్కర పరిస్థితుల్లోనూ రైతుల దగ్గరకు పాలకులు గానీ, అధికారులు గానీ రాకపోవడం బాధాకరం అని అన్నారు. జూలై, ఆగష్టు చివరి వరకు వర్షాలు లేవని… చచ్చి చెడీ కొద్దో గొప్పో పంటలను కాపాడుకునే పరిస్థితిలో వర్షాలు ముంచెత్తాయని ఆవేదనకు గురయ్యారు. గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించి రైతులకు రూపాయి ఇవ్వలేదని జగన్ చంద్రబాబును నిలదీశారు. ఇన్‌పుట్ సబ్సిడీరాష్ట్రవ్యాప్తంగా వేయి కోట్లు ఉంటే అందులో 120 కోట్లు ఒక్క గుంటూరు జిల్లాకే రావాలని.. కానీ ఇంతవరకు రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ అన్నారు.

ఏపి ప్రభుత్వ నిర్వాకంతో ఇన్‌పుట్ సబ్సిడీ రాక, రుణాలు మాఫీ గాక, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రాక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని జగన్ వివరించారు. రుణాలివ్వొద్దంటూ నారా చంద్రబాబు నాయుడు బ్యాంకులకు ఆదేశాలివ్వడంతో పైసా వచ్చే పరిస్థితి లేదని,  దీంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో బయట 2,3 రూపాయల వడ్డీకి రుణాలు తెచ్చుకొని అప్పుల చేసి మరీ పంటలు వేస్తే అవి కూడా చేతికందకుండా పోయాయని రైతుల ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు విమానాల్లో చక్కర్లు కొట్టడం కాదు… భూమి మీదకు వచ్చి రైతుల పంటలను పరిశీలించాలి… వారికి న్యాయం చేయాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)
ముద్రగడ సవాల్
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఏపీకి ఆ అర్హత లేదా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
జయ మరణం ముందే తెలుసా?
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
యాహూ... మీ ఇంటికే డబ్బులు
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments