జగన్ క్రిస్టియన్ కాదా!

YS Jagan not to be a christian yet

ఏపిలో రాజకీయాలు మరింత దిగజారుతున్నాయి. అక్కడ నాయకులు చేస్తున్న ప్రకటనలు కులం, మతం చుట్టు తిరుగుతుండటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు సెబాస్టియన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజమైన క్రైస్తవుడు కాదంటూ ఆరోపించారు. మొన్నీమధ్యన కృష్ణా పుష్కరాల్లో పిండ ప్రదానాలు చేయడం, పూజల నిర్వహించడం వంటివి క్రైస్తవులు చేయరని ఆయన అన్నారు.క్రైస్తవులంతా వాటికీ దూరంగా ఉంటారని ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు జగన్ వెంట ఉన్నాయనడం అవాస్తం అని సెబాస్టియన్ అన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను క్రైస్తవుల కోసం ప్రవేశ పెట్టిందని అన్నారు.

ఇక్కడ సెబాస్టియన్ చేసిన రాజకీయాలు నిజంగా ఏపిలో వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఏపిలో రాజకీయాలు పార్టీల స్థాయి నుండి వ్యక్తిగత స్థాయికి ఎప్పుడో దిగజారాయి. తాజాగా వ్యక్తిగత స్థాయి నుండి కూడా దిగజారిపోయి. రాజకీయాలకు ఉన్న పరువు తీస్తున్నాయి. తాజాగా  సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సర్కార్ పరోక్షంగా చేస్తున్న పనులకు నిదర్శనం అనే అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ నీడన సెబాస్టియన్ లాంటి వ్యక్తి ఓ మతానికి సంబంధించిన విషయాలను రాజకీయాలకు ఆపాదించడం ఎంత వరకు సమంజసం.

కృష్ణా పుష్కరాలకు చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రభుత్వం తరఫున ఆహ్వానించింది. దళిత, క్రిస్టియన్ మంత్రి రావెల కిషోర్ బాబు చేత ఆహ్వానాన్ని పంపించి, ఇప్పుడు పుష్కరాల్లో పాల్గొన్నందుకు జగన్ క్రిస్టియన్ కాదు అని వ్యాఖ్యలు చెయ్యడం ఏం మంచి పద్దతి కాదు. అయినా వైయస్ జగన్ లాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఏ మత విధానాలను పాటించినా అది ఆక్షేపించడం సరికాదు. దర్గాకు వెళ్లినంత మాత్రాన హిందువు, హిందువు కాకుండా పోతాడా..? తిరుపతికి వెళ్లినంత మాత్రాన క్రిస్టియన్, ముస్లిం తన మతానికి చెందిన వాళ్లు కాకుండా పోతారా?

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న పోరాటం మీద, లేదంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలేదు అని విమర్శలకు దిగాలి తప్పితే ఇలాంటి తలాతోకలేని ఆరోపణలు చెయ్యడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు సర్కార్ అమరావతిలో రెండు కోట్లు క్రిస్టియన్ భవన్ కు కేటాయించినంత మాత్రాన క్రిస్టియన్లను ఆయనే ఉద్దరించినట్లు కాదు. ఏది ఏమైనా సెబాస్టియన్ తో సహా చాలా మందికి పచ్చకామెర్లు వచ్చినట్లు జగన్ అభిమానులు అంటున్నారు. అందుకే ఏం మాట్లాడాలో, జగన్ ను ఎలా తప్పుపట్టాలో అర్థంకాక ఇలాంటి చెత్త ప్రకటనలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

Related posts:
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
టాప్ గేర్ లో ముద్రగడ
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
చెత్త టీంతో చంద్రబాబు
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Comments

comments