అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం

YS Jagan promise to give 100 percent fee reimbursement

తెలుగు ప్రజలు ఎవరి పాలనైనా మరిచిపోతారేమో కానీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనను మాత్రం ఎన్నటికి మరిచిపోలేరు. ఆయన తీసుకువచ్చిన పథకాలు, ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఎప్పటికీ ప్రశంసనీయం. వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా పాలిటిక్స్ లో దూసుకెళుతున్న వైయస్ జగన్ కూడా అదే తరహా మార్క్ వేస్తున్నాడు. తాజాగా ఏలూరులో నిర్వహించిన యువభేరిలో ఆయన ఇచ్చిన హామీతో ఎంతో మంది దివంగత నేతను గుర్తుకు తెచ్చుకున్నారు. వైయస్ జగన్ హామీ ఖచ్చితంగా నెరవేస్తున్నారు అని ఇప్పటి నుండే వారు ఆశగా ఉన్నారు.

ఏలూరు యువభేరిలో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాల గురించి యువతకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికే నిప్పు మీద గుగ్గిళంలా ఉన్న యువత జగన్ తో మమేకమయ్యారు. తమ జీవితాలు బాగుపడాలని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలని వారు గట్టిగా నినదించారు. కాగా ఈ సందర్భంగా యువతతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా విద్యార్థిలోకానికి జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీపై అందరూ చర్చించుకుంటున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ఎప్పటికీ గుర్తించుకునేలా చేసింది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలు కూడా చదువుకోవడానికి వీలు కల్పిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఈ పథకం ఎంతో ఆదరణపొందింది. జనాల్లో వైయస్ కు తిరుగులేని ఆదరణకు ఈ పథకం కూడా ఓ కారణం. అయితే వైయస్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కు తూట్లు పొడిస్తూ.. చంద్రబాబు చేసిన మార్పులు విద్యార్థులకు గుదిబండగా మారింది. దీనిపై జగన్ ను ఓ విద్యార్థిని ప్రశ్నించింది.

వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు సిఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రవేశపెట్టారు.. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సవాలక్ష రూల్స్ పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ అందకుండా చేస్తున్నారు.. మీరు సిఎం అయిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారా..? అని ఓ విద్యార్థిని జగన్ ను ప్రశ్నించింది. దీనికి జగన్ సమాధానం విని అందరూ మెచ్చుకున్నారు. జగన్ కూడా తండ్రి బాటలో నడుస్తున్నాడని.. వైయస్ లాగా చిరస్థాయిలో నిలిచిపోయే హామీని ఇచ్చారని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ జగన్ ఏం మాట్లాడారంటే..

‘‘దివంగత నేత, ప్రియతమ వైయస్ రాజశేఖర్ రెడ్డిని మంచిగా నిలబెట్టిన పథకం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే. గతంలో వైయస్ హయాంలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఫీజులు 33వేలు ఫీజు ఉంటే ఆ మొత్తం ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం దానికి తూట్లు పొడిచారు. ఓ పక్క కాలేజీలు ఫీజులు పెంచుకునే వెసలుబాటు కల్పించారు. ఇవాళ ఇంజనీరింగ్  ఫీజులు 75వేలు, లక్షలు దాటాయి కానీ ఫీజు రిఅంబర్స్మెంట్ మాత్రం 33వేలు మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వం 33వేలు మాత్రమే కడితే పేదవాడు మాత్రం మిగిలిన ముప్పైవేలో లేదంటే డెబ్బైవేలో తన ఇంటి నుండి తెచ్చి సంవత్సరం సంవత్సరం కట్టాలంటే కట్టలేని పరిస్థితి. దాంతో ఈ చదువులొద్దు అని పిల్లలు పక్కకు తప్పుకోవాలి అనే దుర్మార్గపు ఆలోచనతో పిల్లల జీవితాలతో చలగాటమాడుతున్నాడు. నేను వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రెవల్యూషనైజ్ చేస్తా..పేదవాడు చదువుకోవాలంటే ఆ చదువులకు ఒక అన్నగా, ముఖ్యమంత్రి హోదాలో ఉండి పూర్తిగా చదివిస్తానని హామీ ఇస్తున్నా.. అంతేకాదు కాలేజీలు ఏదైతే ఛార్జ్ చేస్తారో ఆ ఫీజును వంద శాతం ఇప్పించే కార్యక్రమం చేస్తాను. మెస్, లాడ్జింగ్ కోసం ప్రతి విద్యార్థికి నెలకు రెండు వేలు, సంవత్సరానికి 24 వేలు ఖర్చవుతుంది అది కూడా ఇచ్చేకార్యక్రమం చేస్తాను. కాలేజీకి వెళ్లిన ప్రతి విద్యార్థి ఇంట్లో.. ఒకవేళ నేను చనిపోతే నాన్న ఫోటోతో పాటు.. నా ఫోటో కూడా పెట్టుకునేటట్లు చేస్తాను.. హామీ ఇస్తున్నా తల్లి.. ఖచ్చితంగా నెరవేస్తాను’’

వైయస్ఆర్ తన హయాంలో వంద శాతం ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం 40శాతం వరకు ఫీజును రీయింబర్స్మెంట్ చేస్తున్నారు. విద్యార్థులు దీనావస్థను గమనించిన జగన్ ఎంతో ఆవేదనతో, ఆవేశంతో ఇచ్చిన ఈ హామీ ఖచ్చితంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో ఉండబోతోందన్నమాట.

ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు జగన్ ఇచ్చిన హామీ మీద ఆశలు చిగురిస్తున్నాయి. ఏపిలో జగన్ సిఎంగా అయితే మాత్రం తమ పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా బంగారుమయం అవుతుందని చర్చించుకుంటున్నారు. గతంలో వైయస్ చేసిన హామీ నిలబెట్టుకున్న మాటనే.. ఇప్పుడు జగన్ కూడా ఇస్తున్నారు. అదీ.. హామీ అంటే అని జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
పట్టిసీమ వరమా..? వృధానా..?
మూడింటికి తేడా ఏంటి..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
చెత్త టీంతో చంద్రబాబు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments