చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?

YS Jagan question AP CM Chandrababu Naidu

ఏపికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం, ఆ వెంటనే ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన్ని స్వాగతించడం చేశారు. కాగా దీనిపై ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఏలూరు యువభేరిలో తనదైన స్టైల్లో నిలదీశారు.  ప్రత్యేక హోదా వద్దని చెప్పడానికి నువ్వెవడివయ్యా అని ఏపీ సీఎం చంద్రబాబును తాను అసెంబ్లీలో నిలదీశానని ప్రశ్నించారు. నువ్వెవడివయ్యా స్వాగతించడానికి అని అడిగా ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, అప్పుడు నేను అన్నానని, నువ్వెవడయ్యా స్వాగతించడానికి, ఐదున్నర కోట్ల మంది జీవితాలు హోదా పైన ఆధారపడి ఉన్నాయని, అలాంటప్పుడు ప్యాకేజీని ఎలా స్వాగతిస్తావని ప్రశ్నించానని అన్నారు. మాకెవరికీ ఇష్టం లేకున్నా నువ్వెవడివయ్యా స్వాగతించడానికి అని నేను గట్టిగా నిలదీశానని చెప్పారు.

శాసన సభలో చెప్పే ధైర్యం చాలక శాసన మండలికి వెళ్లాడన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుందని మండలిలో చంద్రబాబు అన్నాడని, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు హోదా వల్ల ఏం మంచి జరిగిందని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. హోదా చంద్రబాబు అత్త సొత్తు కాదు ప్రత్యేక హోదా చంద్రబాబు అత్త సొత్తు కాదన్నారు. చంద్రబాబు మోసాలు తారాస్థాయికి చేరాయన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరమా అన్నారు. మొన్నటి దాకా హోదా కావాలన్న వ్యక్తి ఇప్పుడు అవసరమా అని చెప్పడం ఏమిటన్నారు.

రాష్ట్రాన్ని చీల్చి, ఇప్పుడు టిడిపి-బిజెపి మోసం చేస్తోందన్నారు. విభజనతో హైదరాబాదును కోల్పోయామని, అందుకే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారన్నారు. రెండున్నరేళ్లు గడిచినా హామీ నిలబెట్టుకోలేదన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేస్తామని ఎన్నోసార్లు చెప్పారన్నారు. అందుకే బాబు గట్టిగా అడగలేడు, బీజేపీ కాళ్లు వదలట్లేదు ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి హోదా గురించి గట్టిగా అడగలేని విధంగా ఉందని అన్నారు. అందుకు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడమే కారణమని ఆరోపించారు. హోదా ఇవ్వకున్నా చంద్రబాబు బీజేపీ కాళ్లు పట్టుకొని వదలట్లేదన్నారు. ఢిల్లీ వాళ్లు ఏమిచ్చినా ఫరవాలేదంటున్నారని అన్నారు. వెంకయ్య నాయుడు ఏం మాట్లాడినా కానీ కనీసం పళ్లెత్తి మాట్లాడటం లేదని మండిపడ్డారు. కాగా జగన్ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తుంటే యువభేరిలో యువత విజిల్స్ వేసి తమ మద్దతును తెలిపారు.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments