నిలదీస్తున్న జననేత

YS Jagan Questioned Chandrababu In Assembly

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక హోదా నిరసనలతో అట్టుడికిపోతోంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరూ నల్ల దుస్తుల్లో వచ్చారు. ప్రతిఒక్క వైకాపా నేత టీడీపీపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ నేతలు ప్రత్యేక సహాయంపై చర్చలకు రమ్మంటే.. ప్రతిపక్షం మాత్రం ప్రత్యేక హోదాపై మాట్లాడాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంని చుట్టుముట్టారు. ఇదిలావుంటే.. కేంద్రం ప్రత్యేక హోదా లేదని ‘చావు కబురు చల్లగా చెప్పిన తర్వాత చంద్రబాబు అసలేం ఏం మాట్లాడారు? దానికి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారు? అన్నది ఈ వీడియో చూస్తే మనకు తెలుస్తుంది.

బుధవారం (07-09-2016) అర్థరాత్రి ఈ-మెయిల్ ద్వారా కేంద్రం పంపిన ఏడు పేజీల డాక్యుమెంట్ చదివి, ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు కేంద్రం ప్రత్యేక సహాయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రత్యేక హోదా ఇస్తే చాలా సంతోషం కానీ, మీకు టెక్నికల్‌గా ప్రాబ్లమ్ ఉండి, అది (ప్రత్యేక సహాయం) డిసైడ్ చేసుకున్నప్పుడు దానివల్ల మనకు ఆ డబ్బులు వస్తే కొంతమేరైనా  వెసులుబాటు ఉంటుంది. ఏదిఏమైనా కూడా ఏదైతే వారు (కేంద్రం) ఇచ్చారో.. వచ్చిన దానికి నేను స్వాగతిస్తున్నానని అన్నారు చంద్రబాబు. (ఈ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఆయన వ్యవహార శైలిని గమనిస్తే.. ఈ ప్రత్యేక సహాయంతో అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. అయితే.. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లుగా దీన్ని స్వాగతించినట్లు కనిపించింది)

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఒకసారి కాదు రెండుసార్లు ‘ప్రత్యేక హోదా’ కావాలని తీర్మానం చేసి పంపించారు (కేంద్రానికి). ‘తీర్మానాలు చేసి పంపించిన తర్వాత క్యాటగారికల్‌గా అరుణ్ జైట్లీగారు ప్రత్యేక హోదా ఇవ్వబోమని మరొక్కసారి చెబితే.. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఆహ్వానిస్తున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం అని అంటాడా?’ అని చంద్రబాబు నాయుడిని నిలదీశారు.

ఏదిఏమైనా.. రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియాలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

Related posts:
అమావాస్య చంద్రుడు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments