నాయుళ్లను ఏకిపారేసిన జగన్

YS Jagan slam Naidus on AP Special Status

ఏపికి ప్రత్యేక హోదా మీద ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ యువభేరి పేరుతో కనిపించకుండా ఉద్యమాన్ని ప్రారంభించారు. యువభేరి పేరుతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన యువతతో మమేకమయ్యారు. వారితో చాలాసేపు ముఖాముఖిగా మాట్లాడారు. యువత అభిప్రాయాలను పంచుకోవమే కాకుండా ప్రత్యేక హోదా విషయంలో ఎలా ముందుకు పోవాలో కూడా ఆయన వెల్లడించారు. మొత్తంగా చంద్రబాబు, వెంకయ్య నాయుడులను వైయస్ జగన్ యువత సాక్షిగా ఎండగట్టారు.

హోదా వ‌ల్ల ఉత్త‌రాది రాస్ట్రాలు ఏమేర‌కు అభివ‌ృద్ధి చెందాయ‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారని..  హోదాతోనే చిన్న చిన్న రాష్ట్రాలు ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తున్నాయి జగన్ వెల్లడించారు.  ఉత్త‌రాఖండ్ హిమాచ‌ల ఫ్ర‌దేశ్ లో ప‌రిశ్ర‌మ‌లు అభివృ`ద్ధి చెందాయి.. కోట్లాది రూపాయ‌లు పెట్టుబ‌డులు మ‌ళ్ళాయి.. ల‌క్ష‌ల‌లో ఉద్యోగాలు ల‌భించాయని అన్నారు. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో 10, 864 ప‌రిశ్ర‌మ‌లు. రాగా ల‌క్ష 30 వేల ఉద్యోగాలు వ‌చ్చాయని తెలిపారు. అదే విధంగా ఉత్త‌రాఖండ్‌లో 30 వేల ప‌రిశ్ర‌మ‌లు రాగా దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగాలు ల‌భించాయని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రాయితీలుంటాయి.. ఆదాయం ప‌న్ను రాయితీ ఉంటుంది అని అన్నారు. జీఎస్‌టీలో కూడా హోదా రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాలుంటాయని… ఎక్స‌యిజ్ డ్యూటీ మిన‌హాయింపు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఉంటుంది అని అన్నారు. వాస్త‌వాలు ఇవి కాగా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ప‌నుల‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో చోటు చేసుకున్న అయిదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చును ఇచ్చేది లేద‌ని అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారని తెలిపారు. అదే విధంగా నీటి ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు ప‌నుల‌కు నిధులు ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేశారని.. ఇది అయితే పోల‌వ‌రం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇస్తున్నార‌ని చంద్ర‌బాబు చంక‌లు గుద్దుకుంటున్నారని జగన్ తెలిపారు.  2ల‌క్ష‌ల 25 వేల కోట్లు ప్యాకేజి రూపంలో అందుతాయ‌ని వెంక‌య్య‌నాయుడు ప్ర‌క‌టిస్తున్నారు.. ఏపీకి మోసం చేస్తూ పైకి ప్యాకేజి ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం ధ‌ర్మ‌మేనా? పోల‌వ‌రం నిర్మాణానికి మూడు ఏళ్ళ‌లో రూ 950 కోట్లు ఇచ్చి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.పోల‌వ‌రం విష‌యంలో కేంద్రం మోసం చేసిందని అన్నారు. మొత్తంగా ఏలూరు యువభేరిలో ఇద్దరు నాయుళ్లను(వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు) జగన్ ఏకిపారేశారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఇదో విడ్డూరం
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
మావో నాయకుడు ఆర్కే క్షేమం
బిచ్చగాళ్లు కావలెను
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments