ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి

yuvabheri

ఏపిలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రతిపక్ష నాయకుడు అక్కడి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగా కుదిరిన ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపికి ముందు నుండి వస్తుందనుకున్న ప్రత్యేక హోదా అంతా హుళుక్కే అని కేంద్రం తేల్చేసింది. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఏపికి తీరని అన్యాయం చేస్తోంది. సరిగ్గా ఇదే పాయింట్ ను వాడుకుంటూ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మరోసారి యువభేరిని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని ఆశ చూపి చివరకు.. ఆశలపై నీళ్లు చల్లింది. ఏపి ప్రభుత్వం కేంద్రం వద్ద సరిగా వ్యవహరించని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ బాధ్యతను ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎత్తుకుంది. వైసీపీ అధినేత వైయస్ జగన్ యువభేరి పేరుతో మరోసారి యువతకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపికి ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరాన్ని, ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను, యువతలో ప్రత్యేక హోదా పై అవగాహనను కల్పించేందుకు వైయస్ జగన్ నేరుగా యువతతో భేటీకానున్నారు.

యువభేరితో వైయస్ జగన్ ఓ పక్క ఏపికి ప్రత్యేక హోదా ఆవశ్యతను జనాల్లోకి తీసుకెళ్లడమే కాకుండా తన భవిష్యత్ కు కూడా గట్టి పునాదులు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజానికి ఏపికి ప్రత్యేక హోదా ఎందుకు కల్పించాలి..? ఎంత వరకు లాభం చేకూరుతుంది..? అనే వాటిపై చాలా మంది అవగాహనలేదు. ముఖ్యంగా యువతకు ఈ విషయాలపై అవగాహన ఉంటే ఖచ్చితంగా ఉద్యమం ఉదృతం అవుతుందని జగన్ ప్లాన్ వేశారు. అందుకే యువతను టార్గెట్ గా చేసుకొని స్కెచ్ సిద్దం చేశారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే సమయంలో అవశేష ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యానించారు. కానీ పరిస్థితులు మారిపోయాయి.. కేంద్రం ఇచ్చిన మాటను మార్చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు. అందుకు వేరే రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి.. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం అని కేంద్రం ప్రకటించింది. నిజానికి యువతలో కూడా ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న అవగాహనలేదు. అందుకే జగన్ యువతను టార్గెట్ గా చేసుకొని యువభేరి పేరుతో మరోసారి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే శ్రీకాకుళం, కాకినాడల్లో యువభేరి పేరుతో సభలు నడిపించిన జగన్ ఈసారి స్పీడ్ పెంచారు. కేంద్రం ప్రత్యేక హోదా పై ఆడుతున్న నాటకాలను, ఏపిలో అధికారపక్షం నిర్లక్ష్యాన్ని యువత ముందు ఎండగట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వైసీపీ నాయకుడు జగన్ యువభేరితో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్రం, కేంద్రం నుండి ప్రత్యేక హోదా హామీని రాబట్టడంలో అధికారపక్షం విఫలమవుతున్న తరుణంలో యువతను టార్గెట్ గా చేసిన జగన్ యువభేరికు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో విఫలమవుతోంది. దాంతో ఆ బాధ్యత ప్రతిపక్ష పార్టీలపై పడింది. దాంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వైయస్ జగన్ ప్రత్యేక హోదా పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. యువభేరి పేరుతో చేస్తున్న ఈ సభలో మొత్తం యువతీయువకులే ఉంటారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి ఓటు హక్కు కలిగిన వారే ఉంటారు. మరి ఈ ఓట్లు జగన్ ఖాతాలో పడితే విజయం ఎంతో సునాయాసం. ఇక్కడే జగన్ రెండు లక్ష్యాల మీద దృష్టిసారించారు. ప్రత్యేక హోదా పేరుతో ఓ వైపు పోరాటం చేస్తూనే, మరోపక్క పార్టీని యువతలోకి తీసుకెళుతున్నారు.

వైయస్ జగన్ యువతను టార్గెట్ గా చేసి చేస్తున్న యువభేరీలు ఖచ్చితంగా వైసీపీకి కలిసివస్తాయి. యూత్ ను టార్గెట్ చెయ్యడంలో మరో మతలబును కూడా మనం గమనించారు. అసలు రాజకీయాలు అనేవి కాలేజీ క్యాంపస్ లలోనే స్టార్ట్ అవుతాయి. రాజకీయాలను శాసించే యూత్ నే జగన్ టార్గెట్ చెయ్యడం అంటే ఆయన తన భవిష్యత్ కు గట్టి పునాదులు వేసుకుంటున్నారు. జగన్ ఇలా యూత్ ను టార్గెట్ గా చేసి జిల్లాలు, యూనివర్సిటీలు తిరిగే మాత్రం ఆయన బలం మరింత పెరుగుతుంది. జగన్ ఒరలో చేరుతున్న ఈ లక్షల అస్త్రాలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుకు ముప్పుగా మారడం జరుగుతుంది.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ మాస్టర్ స్కెచ్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
మోదీ భజన అందుకేనా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?

Comments

comments