మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్

YS Jagan to meet Mega Aqua food park victims

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్‌మెంట్ ఎంత బాగా చేస్తారో ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసింది తానే అని చెప్పుకునే చంద్రబాబు… ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా మీడియాలో మాత్రం వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకునే ఘనాపాటి. అందుకే కాల్ మనీ లాంటి అతి పెద్ద దురాగతాన్ని కూడా తొక్కిపెట్టేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని, చంద్రబాబు అవినీతిని ఎండగడుతున్నారు.

పరిశ్రమలు స్థాపించి అందరికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ప్రకటనలు చేస్తూ చంద్రబాబు భలే కలరింగ్ ఇస్తున్నారు. ఫశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన మెగాఆక్వాఫుడ్ పార్క్ ను అక్కడి స్థానికులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆక్వాఫుడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వారు గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ వల్ల వేలాది ఎకరాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు నాశనం అవుతాయని వారు వాదిస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.

మెగాఆక్వాఫుడ్ పార్క్ పేరుతో ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వం కాలుష్యానికి రైతులు, స్థానికుల జీవితాలను బలి చేస్తోంది. ఈ పార్క్ వల్ల భూగర్భజలాలు దెబ్బతిని, సమీప భవిష్యత్ లో నీరు దొరికే పరిస్థితి కూడా ఉండదు అనేది నమ్మలేని నిజం. ఇక ఈ ప్రాంత ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మాత్రం గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టి అరాచక పాలన సాగిస్తున్నారు. ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు ఉండే తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో పోలీసు పాలన సాగుతోంది. అక్కడ స్థానికులు బయటకు రావాలన్నా కూడా ఆధార్ కార్డ్ చూపించాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ రంగంలోకి దిగాడు. నేడు మెగాఆక్వాఫుడ్ పార్క్ బాధితులను పలకరించనున్నారు.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
ఈ SAM ఏంటి గురూ..?
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
బాబు బిత్తరపోవాల్సిందే..
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
అడవిలో కలకలం
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
BSNL లాభం ఎంతో తెలుసా?
శోభన్ బాబుతో జయ ఇలా..
రాసలీలల మంత్రి రాజీనామా
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments