బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన

YS Jagan visited Mega Aqua food project victims

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెగాఆక్వాఫుడ్ పార్క్ మీద ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ నిలదీశారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నిర్మించాలని అనుకోవడం తప్పని అన్నారు. మెగాఆక్వాఫుడ్ పార్క్ బాధితులను కలిసిన ఆయన ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. మెగాఆక్వాఫుడ్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం జీవితాలను నాశనం చేస్తోందని అన్నారు. కన్న తల్లిని చంపి సవితి తల్లిని తెస్తారన్న చందంగా చంద్రబాబు నాయుడు సర్కార్ వ్యవహరిస్తోందని జగన్ నిప్పులు చెరిగారు. పచ్చటి భూములను మెగాఆక్వాఫుడ్ పార్క్ పేరుతో నాశనం చెయ్యడానికి వీలులేదని అన్నారు.

ముందుగా మెగాఆక్వాఫుడ్ పార్క్ పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇక ఈ పార్క్ నుండి జీరో పొల్యూషన్ అని చెప్పిన చంద్రబాబు సర్కార్..  ప్రైవేటు ఫ్యాక్ట‌రీ క‌డుతుంటే ప్ర‌భుత్వ నిధుల‌తో పైప్ లైన్ వేస్తారా అంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం పెట్టుబ‌డిదారుల కోస‌మా ప్ర‌జ‌ల కోస‌మా అని నిల‌దీశారు. రోజుకు మూడు వేల టన్నుల రొయ్యలను శుద్ది చేస్తుంటే రసాయనాలు విడుదలకాకుండా ఎలా ఉంటాయని, చంద్రబాబుకు అంతా తెలుసు అని అయినా కూడా మెగాఆక్వాఫుడ్ పార్క్ కు పూనుకున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాలు వస్తాయని కొంత మంది దీన్ని సమర్థిస్తున్నా కానీ సమీప భవిష్యత్తులో మాత్రం దీని నుండి విడుదలయ్యే రసాయనాలతో పంట పొలాలు నాశనమవుతాయని అన్నారు. దాంతో రైతులు తమ ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఇంత వ్యతిరేకిస్తున్నా ఎందుకు ఇక్కడే ఆక్వాఫుడ్ పార్క్ ను ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారని నిలదీశారు. ఇక్కడి నుండి పది కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరానికి దగ్గర ప్రభుత్వానికి చెందిన 350 ఎకరాల భూములున్నాయని, అక్కడ ఈ పార్క్ ను ఏర్పాటు చేసుకోవచ్చునని సలహా ఇచ్చారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదు అని కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఉండకూడదు అని తన ఉద్దేశం అని అన్నారు. మొత్తానికి వైయస్ జగన్ మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులను పలకరించి, వారికి దైర్యం చెప్పడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలా సూచనల చెయ్యడం ఆయన రాజకీయ పరిణతికి అద్దంపడుతోంది.

Related posts:
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
తాగుబోతుల తెలంగాణ!
వీళ్లకు ఏమైంది..?
నయీం రెండు కోరికలు తీరకుండానే...
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
ఈ SAM ఏంటి గురూ..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
తిరిగిరాని లోకాలకు జయ

Comments

comments