ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు

YSJagamohan Reddy fire on Senior leaders

వైయస్ జగన్ ఏపి రాజకీయాల్లో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు సర్కార్ చేస్తున్న తప్పుల వల్ల ప్రజలు ఈ సారి ఖచ్చితంగా బాబుకు ఓటు వెయ్యరని జగన్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే జగన్ ఎంతో నమ్మకంగా ఉన్నా కానీ ఎక్కడా కూడా నిర్లక్ష్యానికి తావివ్వడంలేదు. అందుకే పార్టీలో ఎక్కడ ఎలాంటి తప్పులకు అవకాశం కల్పించడంలేదు. అందుకే తాజాగా కొంత మంది సీనియర్ లీడర్ల మీద సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గడప గడపకూ వైసీపీ కార్యక్రమం అనుకున్నంత సక్సెస్‌ కాలేదని భావిస్తోన్న జగన్‌…. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చేస్తానని ఘాటుగా వార్నింగ్‌ ఇచ్చినట్లు చెబుతున్నాయి.

గత ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేవాళ్లమని, కానీ చిన్నచిన్న తప్పులతో ఓడిపోయామని, మరోసారి అలాంటి పొరపాట్లు జరగకుండా అందరూ సీరియస్‌గా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలన్న కసితో ముందుకెళ్తోన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి…. పని చేయని లీడర్లపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. మరోసారి తన నుంచి ఫోన్‌ వచ్చే పరిస్థితి ఎవరూ తెచ్చుకోవద్దంటూ కొంచెం కటువుగానే మాట్లాడిన జగన్‌…. పార్టీ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు జరగొచ్చని భావిస్తోన్న జగన్‌… పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూనే… పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ… సమస్యలపై పోరాటం చేస్తే… వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగలమని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
ఈ SAM ఏంటి గురూ..?
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
బతుకు బస్టాండ్ అంటే ఇదే
తిరిగబడితే తారుమారే
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
రాసలీలల మంత్రి రాజీనామా
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
బీసీసీఐకి సుప్రీం షాక్
కాంగ్రెస్ నేత దారుణ హత్య
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments