జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?

YSRCP as National Party

ఏపిలో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న వైసీపీ తన రూపాన్ని మార్చుకుంటోందా..? జగన్ పెద్ద ప్లాన్ తో ముందుకు కదులుతున్నారా..? పార్టీని మరికొన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారా..? ఇలా అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం. అదే అవును. వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ స్పూర్తితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్ ఈ పార్టీని స్థాపించగా.. ఇప్పుడు పార్టీ మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీకి కేరళ, కర్ణాటక, తమిళనాడులలో కూడా అభిమానులున్నారు. అక్కడి తెలుగు వారు ఇప్పటికీ వైసీపీ అన్నా.. జగన్ అన్నా ఎంతో అభిమానిస్తారు. ఏపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న పార్టీని మిలిగిన కొన్ని రాష్ట్రాల్లో కూడా స్థాపించడానికి వైయస్ఆర్ అభిమానులు తహతహలాడుతున్నారు. అయితే ప్రస్తుతానికి జగన్ ఓ రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కేరళ రాష్ట్రం నుండి వచ్చిన వైసీపీ అభిమానులు తమ రాష్ట్రంలో కూడా పార్టీని స్థాపించాలని విన్నవించుకున్నారు.

దీనిపై జగన్ కూడా అనుకూలంగా స్పందిచారు. కేరళలో చాలా మంది వైఎస్ఆర్ అభిమానులు, వైయస్ జగన్ అభిమానులు ఉన్నారని, వారందరూ జగన్ పార్టీ పెట్టాలని కోరుతున్నారని జగన్ తో వారు వెల్లడించారు. కాగా దీనికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా కోచిలో ఓ బహిరంగ సభకు అప్పుడే సన్నాహాలు చేసుకోవాలని కూడా సూచించారట. దాంతో జగన్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కేరళలో పార్టీని విస్తరించడం అంటే ఖచ్చితంగా పార్టీని జాతీయస్థాయి పార్టీగా మార్చడంలో భాగమే అని వారందరూ గట్టిగా నమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే తమ బలాన్ని ప్రదర్శించిన వైసీపీ ఇప్పుడు తెలుగు వారు ఎక్కువగా ఉన్న ఏరియాల మీద దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. అక్కడ కూడా పార్టీని విస్తరించడం ద్వారా జాతీయ స్థాయిలో కూడా ప్రాబల్యాన్ని చాటవచ్చు అని జగన్ ప్లాన్ వేస్తుండవచ్చు. మొత్తానికి జగన్ కార్యాచరణ ఏంటి అనేది కోచి బహిరంగ సభ తర్వాత వెల్లడిస్తాడని తెలిసింది. ఒకవేళ కేరళ తర్వాత మరో రాష్ట్రంలో పార్టీని విస్తరిస్తే జాతీయ స్థాయి పార్టీ హోదాకు వైసీపీ దాదాపుగా అర్హత సాధించినట్లే. ఎందుకంటే తెలుగు వారు ప్రతి రాష్ట్రంలో అధిక సంఖ్యలోనే ఉన్నారు. మరి వారి ఓటు శాతం వైసీపీకి జాతీయ స్థాయి పార్టీని చేస్తుంది. మరి చూడాలి జగన్ ఈ దిశగా ఎలాంటి అడుగులు వేస్తారో.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments