జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు

Jagan-Brahmastram2

యుద్ధంలో గెలవాలంటే ముందుగా మన బలంతోపాటు ఎదుటివారి బలహీనతలను పసిగట్టాలి. ఈ నీతి యుద్ధానికే అనుకుంటే పొరపాటు.. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఇదే నిజమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయానికి పేరెన్నికగన్న పొలిటికల్ లీడర్ చంద్రబాబు నాయుడు. ఏపిలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి సాగుతున్న పరిణామాలు ప్రభుత్వం మీద, పనితీరుపై తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. కాగా గత ఎన్నికల్లో అతిస్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారాన్ని దూరం చేసుకున్న జగన్ ఈ సారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవాలని సిద్దంగాలేరని అనిపిస్తోంది.

అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను సిద్దం చేస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు నిర్వాకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఆలోచనలో నుండి పుట్టిందే గడప గడపకు వైసీపీ. నిజానికి జగన్ విసిరిన అస్త్రం కన్నా చంద్రబాబుకు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం అంటే బెటర్. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు సర్కార్ గతంలో హామీలిచ్చి.. నిలబెట్టుకోలేని ప్రతి మాటను వైసీపీ ప్రజల నుండి సేకరిస్తోంది.

వైయస్ఆర్ జయంతి రోజు సంధించిన ఈ గడప గడపకు వైసీపీ లక్ష్యం ఏంటంటే…

ఎన్నికల టైంలో ఇవ్వకూడని.. చెయ్యలేని హామీలను కూడా ఇచ్చిన చంద్రబాబును ఓ రకంగా ఎండగట్టడం. రైతుల రుణ మాఫీ దగ్గరి నుండి డ్వాక్రా గ్రూపు రుణాల మాఫీ వరకు, జాబు రావాలంటే బాబు రావాలి అన్న నినాదం దగ్గరి నుండి నిరుద్యోగ భృతి వరకు అన్నింటిలో చంద్రబాబు వేసిన తప్పటడుగులను ‘గడప గడపకు’ బయటకు తీస్తోంది. జగన్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు భుజస్కందాలపై మోస్తూ.. ప్రజల్లోకి దూసుకెళితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ దూకుడు కళ్లెం వేసే వాళ్లు ఉండరు.

ఈ విషయంపై పార్టీ శ్రేణులతో సమీక్షిస్తు గడప గడపకు ప్రాధాన్యతనివ్వాలని జగన్ ఆదేశించారని తెలిసింది. అదే విధంగా ‘మీరు గెలిస్తేనే నేను గెలుస్తాను.. ఆ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు’ అని దీని ఆవశ్యకతను శ్రేణులకు గట్టిగా చెప్పడం జరిగింది. ప్రజలకు గడప గడప ద్వారా దగ్గరవ్వాలని, ప్రజలకు అవసరమైన వాటిపై స్థానిక నాయకులు ఇచ్చిన వాగ్దానాలను తాను నిలబెట్టుకుంటానని కూడా జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈవిధంగా ఏపిలోని ప్రతి గడపకు వైసీపీ నాయకులు వెళ్లి స్థానికుల సమస్యలతో పాటుగా, నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో..? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో..? లెక్కలు తీస్తున్నారు. ఇలా ప్రజలకు  చాలా వాటిపై  ప్రశ్నలను సంధించి.. వాటిపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మరి ఇది గనక వందకు వంద శాతం విజయవంతమైతే మాత్రం జగన్ అనుకున్న లక్ష్యానికి దాదాపుగా పూల బాటలు వేసుకున్నట్లే.

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ప్రత్యేక హోదా లాభాలు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Comments

comments