చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

YSRCP MLA gave shock to AP CM Chandrababu Naidu

బలం లేకపోయితే బల్లిపామై కరవడం అంటే నారా చంద్రబాబు నాయుడుకు బాగా తెలిసివచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ లో వైసీపీ ఎమ్మెల్యే దిమ్మతిరిగిపోయే షాకిచ్చాడు. అసలు సభలో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళంలో చాలా సేపు షాక్ లోనూ ఉండిపోయాడు బాబుగారు. నిజాలు మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే మాటలు చంద్రబాబు నాయుడుకు మింగుడుపడలేదు.. అంతే వెంటనే అసహనం ప్రదర్శించారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైక్ కట్ చేయించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోస్తవంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సిఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ సభలో ముఖ్యమంత్రితో పాటు పలువురికి మాట్లాడే అవకాశం కల్పించారు. అయితే పద్దతి ప్రకారం చంద్రబాబు నాయుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్యను కూడా వేదిక మీదకు పిలిచి మాట్లాడమని చెప్పారు. అయితే వేదిక మీద నుండి రాజకీయం చేయవద్దని, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పమని సిఎం ఎంఎల్ఏకు మైక్ ఇచ్చారు.

మైక్ అందుకున్న ఎమ్మెల్యే ఐజయ్య సిఎం చేతుల మీదగా పథకం ప్రారంభమవటం సంతోషంగా ఉందన్నారు. అలా అంటూనే, అసలు ఈ పథకానికి శంకుస్ధాపన వేసి పనులు మొదలుపెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే అంటూ బాంబు పేల్చారు. తాను పాల్గొన్న సభలో వైఎస్ ఆర్ ప్రస్తావన రావటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. సదరు ఎంఎల్ఏ ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డినే కీర్తించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. వెంటనే ఐజయ్యను చంద్రబాబు గద్ధించారు. రాజకీయాలు చేయవద్దని, రాజకీయాలు చేయాలంటే తానూ చాలా చేస్తానన్నారు. పునాదులు చాలామంది వేసి వెళ్ళిపోతారని, కానీ డబ్బులు మంజూరు చేసి పథకాన్ని పూర్తిచేయటమే  ముఖ్యమన్నారు. అంటూనే ‘తమ్ముళ్ళూ మీరే చెప్పండి..పథకాన్ని ఎవరు పూర్తిచేసారంటూ ప్రజలను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఏసయ్య ఇంకేదో మాట్లాడబోతే నిర్వాహకులు మైక్ కట్ చేసి  వేదికపై నుండి తీసుకెళ్లిపోయారు.

అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అవమానించడమేనని అంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ పథకానికి పునాదులు వేసిన మాట వాస్తవమేనని, అదే విషయాన్ని ఎమ్మెల్యే ఐజయ్య ప్రజలు ముందు చెబితే చంద్రబాబు నాయుడు ఎందుకు చిరాకుపడ్డారు అని మండిపడుతున్నారు. కాగా సోషల్ మీడియాలో ఐజయ్యకు జగన్ మద్దతుదారులు పూర్తి అండగా నిలుస్తున్నారు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
మా టీవీ లైసెన్స్ లు రద్దు
నయీం బాధితుల ‘క్యూ’
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
2018లో తెలుగుదేశం ఖాళీ!
మంత్రుల ఫోన్లు బంద్
తిరిగబడితే తారుమారే
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
తెలంగాణ 3300 కోట్లు పాయె
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
ఏపికి యనమల షాకు
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments